భారత్‌లో తొలిసారి గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్ భయం చైనాను వణికిస్తోంది. గ్వాంగ్‌జూ నగరంలో తాజాగా ఆరు కరోనా కేసులు బయటపడగా.. ఇప్పటివరకు వంద మందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. ఈ క్రమంలో ప్రజలను ఇళ్లల్లోనే కట్టడి చేసేందుకు చైనా సర్కారు చర్యలు ప్రారంభించింది. డ్రోన్ల ద్వారా ప్రజల రాకపోకలను గమనిస్తూ వారిని ఇళ్లకే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఇందుకు అరవై డ్రోన్లను వినియోగిస్తోంది. వీటి సాయంతో ఆంక్షల సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారిని, మాస్కు ధరించనివారిని పోలీసులు గుర్తిస్తున్నారు.
గ్వాంగ్‌జూలోకి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలను ఇప్పటికే నిషేధించారు. థియేటర్లు సహా ఇతరత్రా వినోద కార్యకలాపాలపై నిషేధం అమలవుతోంది.
ఇదీ చూడండి: 'ఎయిర్ ఇండియా' హ్యాకింగ్ వెనుక డ్రాగన్!