ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. 1949 తర్వాత తొలిసారిగా.. 2019లో జననాల రేటులో అత్యంత తగ్గుదల నమోదైంది. 2019లో జననాల రేటు ప్రతి వెయ్యి మందికి 10.48శాతంగా నమోదైనట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
చైనాలో 2017లో కోటీ 70లక్షల మంది శిశువులు జన్మించగా, 2018లో కోటీ 50లక్షల మంది జన్మించారు. 2019లో అది మరింత తగ్గిపోయి ఆ సంఖ్య ఒక కోటి 40లక్షలకు పడిపోయింది.
వృద్ధల సంఖ్యలో పెరుగుదల
చైనా జనాభా 140 కోట్లు కాగా అందులో 16 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారి సంఖ్య సుమారు 90 కోట్లు ఉంది. వృద్ధుల సంఖ్యలో పెరుగుదల, పని చేసే వారి సంఖ్యలో తగ్గుదలకు ఈ సంఖ్యను సూచికగా భావిస్తున్న చైనా.. జనాభా పెరుగదల కట్టడికి అమలు చేసిన నిబంధనలను సడలించింది. ఆర్థిక రంగంపైనా దీని ప్రభావం పడుతూ ఉండడం వల్ల.. ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనను 2016లో ఎత్తివేసింది. అయితే జీవన వ్యయం భారీగా పెరగడం చైనాలో అనేక మంది ఒక బిడ్డకే ప్రాధాన్యం ఇస్తున్నారు.