3 నుంచి 17 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా అందించేందుకు చైనా రంగం సిద్ధం చేస్తోంది. ఈ వయస్కుల వారికోసం 'సినోవాక్' సంస్థ అభివృద్ధి చేసిన 'కరోనావాక్' కొవిడ్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులను ఆ దేశ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు సినోవాక్ సంస్థ ఛైర్మన్ యిన్ వీయ్డాంగ్ తెలిపారు.
అయితే.. ఈ వ్యాక్సిన్ను ఎప్పటి నుంచి వినియోగించనున్నారు? ఏ వయస్సు వారికి అందించాలి? అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని యిన్ వీయ్డాంగ్ చెప్పారు. వందలాది మంది ఈ వయసు వలంటీర్లపై నిర్వహించిన ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ పరీక్షల్లో తమ టీకా సమర్థంగా పని చేస్తుందని తేలినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చైనాకు చలి భయం- లద్దాఖ్ నుంచి రివర్స్ గేర్!
ఇదీ చూడండి: Trump: చైనా మూల్యం చెల్లించాల్సిందే