ETV Bharat / international

సరస్సులోకి దూసుకెళ్లిన బస్సు.. 21 మంది మృతి

చైనాలోని గుయిజౌ రాష్ట్రంలో ఓ బస్సు అదుపుతప్పి సరస్సులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Bus in China plunges into a lake
సరస్సులోకి దూసుకెళ్లిన బస్సు.
author img

By

Published : Jul 7, 2020, 6:21 PM IST

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. గుయిజౌ రాష్ట్రంలోని అన్షున్​ నగర సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిచారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది సీసీటీవీ ఛానల్​. బస్సు అకస్మత్తుగా వేగం పెరిగి.. ఆరు లైన్ల రహదారి, దాని పక్కన ఉన్న కంచెను దాటుకుని సరస్సులోకి దూసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.

  • A bus fell into a lake in Anshun in China's Guizhou Province. Rescue is underway and the number of casualties is unknown pic.twitter.com/yNMBt6wjo8

    — China Xinhua News (@XHNews) July 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు అన్షున్​ నగర అధికారులు తెలిపారు. జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.