చైనాలో 70వ వ్యవస్థాపక దినోత్సవం సందడి వారం ముందే మొదలైంది. అక్టోబర్ 1న జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన నగరాల్లో ఇప్పటినుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హీఫీ నగరంలో విద్యుత్ దీప ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ సరస్సు పక్కన ఉన్న 130 భవనాలను లక్ష విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. బాణసంచా, లాంతర్ల ప్రదర్శనలు ఈ కాంతుల సోయగాన్ని మరింత పెంచుతున్నాయి.
ఝేజియాంగ్ రాష్ట్రం హ్యాంగ్ఝౌ నగరంలోనూ ఇలాంటి ప్రదర్శనే ఏర్పాటు చేశారు. అక్టోబర్ 7వరకు ఈ దీపోత్సవం కొనసాగనుంది.
ఇదీ చూడండి: మోదీ ప్రసంగం కోసం షెడ్యూల్ మార్చుకున్న ట్రంప్!