ETV Bharat / international

చైనాను వణికిస్తున్న బ్యుబానిక్​ ప్లేగు - బ్యుబానిక్​ ప్లేగు చైనా

చైనాలో బ్యుబానిక్​ ప్లేగు బయటపడం వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగోలియాలోని బయన్పూర్​ ఆసుపత్రిలో దీనిని గుర్తించారు. అయితే అసలు బ్యుబానిక్​ ప్లేగు అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? తెలుసుకుందాం.

bubonic plague was traced in China
చైనాను వణికిస్తున్న బ్యుబానిక్​ ప్లేగు
author img

By

Published : Jul 7, 2020, 8:05 AM IST

కొవిడ్‌ వ్యాధి పుట్టిన చైనాను మరో భయంకర వ్యాధి కలవరపెడుతోంది. బ్యుబానిక్‌ ప్లేగు తాజాగా వెలుగు చూడడం వల్ల చైనాలో గుబులు మొదలయింది. అక్కడి ఉత్తర ప్రాంతంలోని ఇన్నర్‌ మంగోలియా స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని బయన్నూర్‌ ఆస్పత్రిలో ఒక వ్యక్తికి బ్యుబానిక్‌ ప్లేగు ఉన్నట్లు గుర్తించారు. ఈ నగరంలో ప్లేగు వ్యాధి మరింతగా వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు స్థానిక అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది చివరి వరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చైనాతో సరిహద్దులు పంచుకునే మంగోలియాలోనూ ఈ వ్యాధి లక్షణాలు తాజాగా వెలుగు చూశాయి. బయాన్‌-ఉల్గీలో 15 ఏళ్ల కుర్రాడికి సోకినట్లు అనుమానిస్తున్నారు.

ఏమిటీ బ్యుబానిక్‌ ప్లేగు?

ప్లేగు వ్యాధి ఎర్సినియా పెస్టిస్‌ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. ఎలుకలు వంటి చిన్న చిన్న క్షీరదాలు, వాటిని ఆశ్రయించి ఉండే కీటకాల్లో ఈ సూక్ష్మజీవి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న కీటకాలు కుట్టినప్పుడు మనుషులకు వ్యాపిస్తుంది. ప్లేగులో ప్రధానంగా రెండురకాలుంటాయి. ఒకటి బ్యుబానిక్‌ ప్లేగు, రెండోది న్యుమోనిక్‌ ప్లేగు. లింఫ్‌ గ్రంధుల్లో చేరితే దాన్ని బ్యుబోనిక్‌ ప్లేగు అని పిలుస్తారు.

లక్షణాలేమిటి?

ఒక్కసారిగా జ్వరం వస్తుంది. వణుకు ఉంటుంది. తల నొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసంతో బాధపడతారు. వాంతులవుతాయి. శరీరమంతా విస్తరించి ఉండే లింఫ్‌ గ్రంధుల్లో వాపు వస్తుంది. భరించలేని నొప్పి ఉంటుంది.

మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందా?

బ్యుబానిక్‌ ప్లేగు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించడం అరుదే. ఈ వ్యాధి ఊపిరితిత్తులకు చేరి న్యుమోనిక్‌ ప్లేగుగా మారితే మాత్రం భయంకరమవుతుంది. ఇతరులకు వ్యాపించే అవకాశం ఎక్కువవుతుంది. 24 గంటల్లోగా గుర్తించి చికిత్స అందివ్వకపోతే మరణించే ప్రమాదం పెరుగుతుంది. న్యుమోనిక్‌ ప్లేగు ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ తుంపరల ద్వారా ఇతరులు దాని బారిన పడతారు.

మృతదేహాల నుంచి వ్యాపిస్తుందా?

బ్యుబానిక్‌ ప్లేగుతో మరణించిన వ్యక్తి దేహంలోని స్రావాల్లో బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల అంతిమ సంస్కారాలు నిర్వహించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సోకే అవకాశం ఎక్కువ.

చికిత్స ఏమిటి?

వ్యాధిని సకాలంలో గుర్తించి యాంటీబయోటిక్స్‌ ఇస్తే కోలుకునే అవకాశాలు ఎక్కువే. సకాలంలో చికిత్స అందితే మరణాల ముప్పు పదిశాతమే. లేదంటే 60శాతం వరకు ముప్పు ఉంటుంది. న్యుమోనిక్‌ ప్లేగుగా మారితే మాత్రం ముప్పు మరింత పెరుగుతుంది.

బ్లాక్‌ డెత్‌ అని ఎందుకు పిలుస్తారు?

బ్యుబానిక్‌ ప్లేగును బ్లాక్‌ డెత్‌ అని కూడా పిలుస్తారు. మానవ చరిత్రలో 14 శతాబ్దంలో ఇదో భయంకర అంటువ్యాధిగా పరిణమించింది. కోట్ల మంది ప్రాణాలను హరించింది. ఐరోపా జనాభాలో దాదాపు మూడొంతుల మంది ఈ వ్యాధితో మరణించారు. దీంతో దీనికి బ్లాక్‌డెత్‌ అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాధి అరుదుగానే వస్తోంది. 2010 నుంచి 2015 వరకు ప్రపంచ వ్యాప్తంగా 3,248 కేసులు మాత్రమే వెలుగు చూశాయి.

మూలాలెక్కడ?

ఈ వ్యాధికీ మూలాలు చైనాలోనే ఉన్నాయని చెబుతుంటారు. చైనాలోని యున్నాన్‌ నుంచి ఓపియం రవాణా మార్గాల ద్వారా ఈ వ్యాధికారక బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు భావిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.