ETV Bharat / international

Kabul airport: కాబుల్​ ఎయిర్​పోర్ట్​లో భారీ దాడికి కుట్ర! - ఉగ్రదాడి

అఫ్గానిస్థాన్​లోని కాబుల్​ విమానాశ్రయం(Kabul airport) వద్ద భారీ ఉగ్రదాడికి(Terror attack) కుట్ర జరుగుతోందని హెచ్చరికలు చేశాయి అమెరికా, బ్రిటన్​, ఆస్ట్రేలియా, సహా పలు దేశాలు. తమ పౌరులు ఎయిర్​పోర్ట్​ను వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించాయి.

targeting Kabul airport
కాబుల్​ ఎయిర్​పోర్ట్​లో భారీ ఉగ్రదాడికి కుట్ర
author img

By

Published : Aug 26, 2021, 1:09 PM IST

Updated : Aug 26, 2021, 2:15 PM IST

తాలిబన్ల చెర(Afghan Taliban) నుంచి బయటపడేందుకు కాబుల్​ విమానాశ్రయానికి(Kabul airport) భారీగా ప్రజలు తరలివస్తున్న వేళ.. ఎయిర్​పోర్ట్​ ప్రాంతంలో భారీ ఉగ్రదాడికి కుట్ర(Terror Attack) జరుగుతోందా? అంటే అవుననే అంటున్నాయి వేర్వేరు దేశాలు. కాబుల్​ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది బ్రిటన్​ ప్రభుత్వం. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వేలాది మంది ఎయిర్​పోర్ట్​కు తరలివస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

తమ పౌరులు కాబుల్​ విమానాశ్రయం నుంచి దూరంగా వెళ్లిపోవాలని.. బ్రిటన్​తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇస్లామిక్​ స్టేట్​ గ్రూప్​తో సంబంధాలున్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ హెచ్చరికలు చేసిన తర్వాత.. పలు దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి.

విమానాశ్రయం వద్ద భారీ దాడికి కుట్ర జరుగుతోందని విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందినట్లు బ్రిటీష్​ రక్షణ మంత్రి జేమ్స్​ హీపీ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

ఉగ్రదాడిపై ఆస్ట్రేలియా హెచ్చరిక..

కాబుల్​ ఎయిర్​పోర్ట్​ వద్ద భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని తమ పౌరులను హెచ్చరించింది ఆస్ట్రేలియా. విమానాశ్రయం ప్రాంతంలో ఉన్న తమ పౌరులు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అక్కడే ఉండాలని సూచించింది. బ్రిటన్​, న్యూజిలాండ్​ ప్రకటనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారైస్​ పేనీ తెలిపారు. గత వారం నుంచి ఇప్పటి వరకు మొత్తం 4వేల మందిని కాబుల్​ నుంచి తరలించినట్లు చెప్పారు.

తరలింపు నిలిపేసిన ఫ్రాన్​..

కాబుల్​ విమానాశ్రయం నుంచి ప్రజల తరలింపు ప్రక్రియను శుక్రవారం రాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఫ్రాన్స్​ ప్రధానమంత్రి జీన్​ కాస్టెక్స్​. అమెరికా బలగాల ఉపసంహరణకు ఆగస్టు 31 గడువు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2వేల మంది అఫ్గాన్​ పౌరులు, వందల మంది ఫ్రాన్స్​ ప్రజలను తరలించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Afghan Crisis: అఫ్గాన్​లో తాలిబన్లను మించిన ఆహార సంక్షోభం!

Last Updated : Aug 26, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.