ETV Bharat / international

అమెరికా-చైనా మధ్య 'హాంకాంగ్​'పై కొత్త రగడ

హాంకాంగ్​లో ప్రజాస్వామ్యవాదుల నిరసనలకు అమెరికా సెనేట్ మద్దతు ప్రకటించడాన్ని డ్రాగన్ దేశం తీవ్రంగా తప్పుబట్టింది. సెనేట్​లో ప్రవేశపెట్టిన బిల్లు చట్టంగా మారకుండా నిలువరించాలని సూచించింది. లేదంటే అగ్రరాజ్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

అమెరికా-చైనా మధ్య 'హాంకాంగ్​'పై కొత్త రగడ
author img

By

Published : Nov 20, 2019, 3:20 PM IST

హాంకాంగ్​ నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తూ అమెరికా సెనేట్ తీసుకున్న నిర్ణయాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంపై తగిన వివరణ ఇవ్వాల్సిందిగా చైనాలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. హాంకాంగ్​ హక్కులపై వేసిన బిల్లు... చట్టంగా రూపుదాల్చితే అత్యంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

తమ నిరసన వ్యక్తం చేయడానికి అమెరికా దౌత్యవేత్త విలియం క్లేయిన్​ను విదేశాంగ కార్యాలయానికి పిలిచినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం ఆపాలని హితవు పలికింది.

'అమెరికా ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం దాల్చకుండా అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దాన్ని ఎదుర్కొవడానికి చైనా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవించినా అమెరికా భరించాల్సి ఉంటుంది.'
-చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ.

సెనేట్ బిల్లు

హాంకాంగ్​లో మానవహక్కులు సహా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్దేశించిన బిల్లును అమెరికా దిగువ సభ సెనేట్ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. నిరసనకారులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసింది. హాంకాంగ్​లో బాష్పవాయుగోళాలు, రబ్బర్​ బుల్లెట్ల అమ్మకాలను నిషేధించాలని మరో తీర్మానంలో పేర్కొంది. సెనేట్​ ఆమోదంతో బిల్లును ప్రతినిధుల సభ​లో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ఆమోదిస్తే చట్టంగా రూపాంతరం చెందనుంది.

ఇదీ చూడండి: చైనాకు షాక్​.. హాంకాంగ్ నిరసనకారులకు అమెరికా మద్దతు

Mumbai, Nov 20 (ANI): The makers and star-cast of 'Tanhaji: The Unsung Warrior' launched its trailer in Mumbai. Actor Ajay Devgn looked handsome in all-black outfit. 'Tanhaji' will be the 100th release of Ajay Devgn. Actor Saif Ali Khan wore a pant-suit and looked dapper. Filmmaker Rohit Shetty was also present during the launch. The film is directed by Om Raut. 'Tanhaji: The Unsung Warrior' will hit theaters on January 10, 2020.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.