ETV Bharat / international

ఆ నగరంలో మాస్కులు అవసరం లేదంట! - ఆ నగరాని మాస్కులు అవసరం లేదంట!

మాస్కులు ధరించే అవసరం లేదంటూ బీజింగ్​లోని స్థానిక వ్యాధుల నిర్మూలన కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆరుబయట వ్యాయామాలూ చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే వ్యక్తిగత దూరం మాత్రం పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు.. చైనాలో మళ్లీ కరోనా ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహమ్మారి నుంచి చైనా ఇంకా బయటపడలేదని చెబుతున్నారు.

biejing
బీజింగ్
author img

By

Published : May 18, 2020, 11:38 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణతో ప్రజలు బయటకు వస్తే ముఖానికి మాస్కు వేసుకోవడం తప్పనిసరి చేశాయి పలు దేశాల ప్రభుత్వాలు. అయితే చైనా రాజధాని బీజింగ్‌లో మాత్రం ఆ అవసరం లేదంటూ అక్కడి స్థానిక వ్యాధుల నిర్మూలన కేంద్రం కొత్త మార్గదర్శకాలను ఆదివారం ప్రకటించింది. అయితే వ్యక్తిగత దూరం మాత్రం పాటించాల్సిదేనని స్పష్టం చేసింది. ఇలా ప్రకటించినవారిలో ప్రపంచవ్యాప్తంగా బీజింగ్‌ నగరమే మొదటిది. వాతావరణం అనుకూలంగా ఉంటే ఆరుబయట వ్యాయామాలు చేసుకోవచ్చని, దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు కొన్ని నెలల తర్వాత మాస్కుల లేకుండా స్వేచ్ఛగా బహిరంగ ప్రదేశాల్లో గాలి పీల్చుకోనున్నారు.

పార్లమెంట్​లో వ్యూహాలు

మే 22న బీజింగ్‌లో చైనా పార్లమెంటు సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సమావేశాలకు సుమారు 5 వేల మంది హజరుకానున్నారు. ఆ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

చైనాకు మళ్లీ కరోనా ముప్పు

కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ, గతకొన్ని రోజులుగా అక్కడ మళ్లీ కొవిడ్‌-19 కేసులు బయటపడుతున్నాయి. ఈ సందర్భంలో కరోనా మహమ్మారి నుంచి చైనా ఇంకా బయటపడలేదని అక్కడి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చైనీయుల్లో లేని కారణంగా చైనాకు ఈ వైరస్‌ ముప్పు మరోసారి పొంచివుందని తాజాగా ఆ దేశ ప్రభుత్వ సీనియర్‌ ఆరోగ్య సలహాదారుడు డా.జోంగ్‌ నాన్‌షాన్‌ హెచ్చరించారు.

ప్రముఖ అంతర్జాతీయ వార్తా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోంగ్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. రెండవసారి ముంచుకొస్తున్న ప్రమాద సమయంలోనైనా చైనా అధికారులు నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరించారు.

కరోనా వైరస్‌ విజృంభించిన తొలి రోజుల్లో కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు బహిరంగపరచలేదని స్పష్టం చేశారు. వైరస్‌ తీవ్రతను తక్కువగా చేసి చూపించారన్నారు.

సార్స్ హీరో

2003లో వచ్చిన సార్స్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో డా.జోంగ్‌ చేసిన కృషికి అతన్ని సార్స్‌ హీరోగా అభివర్ణిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ పోరులో భాగంగా చైనా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా కొవిడ్‌-19 మానవుల మధ్య సంక్రమిస్తుందని మొట్టమొదటిసారిగా జనవరిలో చైనా అధికారిక మీడియాలో ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.