ETV Bharat / international

శ్మశానంలో పండ్ల తోట.. తగ్గిన ఆహార కొరత - శ్మశానంలో ఆపిల్​ తోట

ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంతంలో తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. దాన్ని అధిగమించేందుకు వినూత్న ప్రయత్నం చేశారో మహిళ. పండ్ల తోటను సాగు చేసి.. ఎందరికో సాయమందించాలి అనుకున్నారు. అయితే అందుకు ఓ శ్మశానాన్ని ఎంచుకున్నారు . అందులో ఎన్నో యాపిల్​ చెట్లను పెంచుతూ.. అందమైన వనంలా మార్చి.. వందలాది మంది ఆకలి తీరుస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.

Austraila: Fruit harvested from cemetery feeds local people and animals in Ballarat
స్మశానంలోని పండ్ల తోటతో ఆ ప్రాంతంలో తగ్గిన ఆహార కొరత
author img

By

Published : Mar 27, 2021, 8:12 PM IST

ఆస్ట్రేలియా విక్టోరియాలోని బల్లారత్​ శ్మశానంలో ఓ మహిళ చక్కగా పండ్ల తోటను సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. శ్మశానవాటిక అంటేనే అదో నిర్మానుష్య ప్రదేశం. కానీ, ఆ ప్రదేశాన్ని ఓ అందమైన వనంలా మార్చారు హిలెన్​ ఆర్చర్డ్​ ఎల్లెన్​ బర్న్స్​. ఎటుచూసినా యాపిల్​ పండ్ల చెట్లతో ఇప్పుడా తోట కళకళలాడుతోంది.

శ్మశానంలో పండ్ల తోట.. తగ్గిన ఆహార కొరత

తొలుత.. రోడ్డుపై వ్యర్థాలను తగ్గించడంపైనే దృష్టిసారించారు బర్న్స్​. కానీ, బల్లారత్​లో విపరీత ఆహార కొరతను గ్రహించిన ఆమె.. ఇలా యాపిల్​ చెట్లు పెంచడం దిశగా ముందడుగేశారు. ఇలా నాలుగేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్​ ప్రారంభమవ్వగా.. నాటి నుంచి సుమారు 10 టన్నుల యాపిల్​ పండ్లను పండించి.. ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించారు. ఎన్జీఓల తరఫున అక్కడి ప్రజలందరికీ ఎలాంటి సమయంలోనైనా తాజా ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

"2016లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. ఆ ఏడాది 12శాతం బల్లారత్​ స్థానికులు ఆహారం కొరతను అధిగమించారు. అయితే.. లాక్​డౌన్ సమయంలో ఈ పండ్ల తోట ద్వారా మరింత మంది ఆకలి తీరడం వల్ల.. తాజా సర్వేలో ఆ సంఖ్య రెట్టింపైనట్టు తేలింది."

- హిలెన్​ ఆర్చర్డ్​ ఎల్లెన్​ బర్న్స్​

శ్మశానంలో యాపిల్​ తోటను సాగు చేస్తున్నామని తప్పుగా భావించాల్సిన అవసరం లేదని ఓ అధికారి తెలిపారు. ఆకలితో అలమటిస్తూ రోజుకు వందల మంది రోడ్డుపై తిరుగుతున్నారు. అలాంటి వారికోసమే ఇలా పెద్దమొత్తంలో పండ్లను పండించి వారికి ఈ ఎన్జీఓలు అండగా నిలుస్తున్నాయన్నారు.

ఈ తోటలోని పండ్లను వన్యప్రాణి సంరక్షణకారుల సాయంతో.. జంతువులకూ ఆహారం సరఫరా అయ్యేలా చేస్తున్నట్టు బర్న్స్​ చెప్పారు. ఇలా ఇప్పటివరకు బల్లారత్​ వైల్డ్​లైఫ్​ పార్క్​ లాంటి వన్యప్రాణుల పరిరక్షణ కేంద్రాలకు సమారు ఐదున్నర టన్నుల యాపిల్స్​ పంపిణీ అయ్యాయని బర్న్స్​ వివరించారు.

బర్న్స్​ చేసే ఈ వినూత్న ప్రయోగం కారణంగా.. అటు మనుషులు, ఇటు జంతువులు ఎంతో ప్రయోజనం పొందుతున్నాయి.

ఇదీ చదవండి:ఆ దేశంలో శునకాలు-అశ్వాలకు పింఛన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.