నేపాల్‌కు ఎనిమిది లక్షల కరోనా టీకా డోసులను చైనా కానుకగా అందించింది. సినోఫార్మ్ సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సిన్ డోసులను చైనా రాయబారి హూ యాంకీ నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రి హృదయేష్ త్రిపాఠికి సోమవారం కాఠ్మాండూలో అందించారు.
నేపాల్ సైన్యానికి భారత్ లక్ష డోసులను అందజేసిన కొద్ది గంటలకే చైనా ఈ పంపిణీ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం నేపాల్ రెండో దశ టీకా పంపిణీకి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సీరం సంస్థ నుంచి అందాల్సిన 20 లక్షల డోసుల కోసం ఎదురుచూస్తోంది.
ఇప్పటివరకు నేపాల్ 17 లక్షల మందికి టీకా పంపిణీ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి మరో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని భావిస్తోంది.
ఇదీ చదవండి : చమురు శుద్ధి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం