ETV Bharat / international

సైనిక దాడిలో 100 మందికిపైగా తాలిబన్ల హతం

author img

By

Published : Jun 3, 2021, 9:59 AM IST

అఫ్గానిస్థాన్​ భద్రతా బలగాల చేతుల్లో వంద మందికిపైగా తాలిబన్లు హతమయ్యారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Taliban terrorists killed
అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు హతం

అఫ్గానిస్థాన్​లో భారీ స్థాయిలో తాలిబన్ల ఊచకోత జరిగింది. 100మందికిపైగా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో మరో 50 మంది తాలిబన్లు గాయపడ్డారని, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాక, మందు గుండు సామాగ్రిని కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

24 గంటల వ్యవధిలో లాఘ్​మన్, కునార్, నంగార్​హర్​, ఘాజ్ని, పాక్టియా, మైదాన్ వార్దక్, ఖోస్త్, జాబుల్​, బగ్దీస్​, హేరాత్, ఫర్యాబ్, హెల్​మాండ్, బాగ్​లన్​ రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్లను నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టిన మైన్లను నిర్వీర్యం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

అఫ్గానిస్థాన్​లో కొద్ది రోజులుగా హింస, తిరుగుబాటు పేట్రేగిపోతోంది. ఇప్పటివరకు ఈ దాడిపై తాలిబన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భద్రతా చెక్​పాయింట్లు, కాన్వాయ్​లపై దాడులు ప్రారంభించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: వ్యాన్​పై బాంబు దాడి- నలుగురు లెక్చరర్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.