ETV Bharat / international

Afghan News: కాబుల్ వెళ్లిన విమానం హైజాక్- నిజమేనా? - ఉక్రెయిన్ న్యూస్

Ukrainian plane hijacked
కాబుల్ వెళ్లిన విమానం హైజాక్- ఎవరి పని?
author img

By

Published : Aug 24, 2021, 1:48 PM IST

Updated : Aug 24, 2021, 3:18 PM IST

13:43 August 24

Afghan News: కాబుల్ వెళ్లిన విమానం హైజాక్- నిజమేనా?

అఫ్గానిస్థాన్​ నుంచి తమ ప్రజలను స్వదేశానికి తరలించేందుకు వెళ్లిన ఉక్రెయిన్​ విమానం హైజాక్​కు గురైందని(Ukraine News) రష్యా వార్తా సంస్థ టాస్​ వెల్లడించింది. అయితే ఈ పని ఎవరు చేశారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. హైజాకర్లు ఈ విమానాన్ని ఇరాన్​కు దారిమళ్లించినట్లు ఉక్రెయిన్ విదేశాంగ సహాయమంత్రి తెలిపారని టాస్​ పేర్కొంది.

"ఆదివారం మా విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు(Ukraine Plane Hijack). మంగళవారం ఆ విమానాన్ని దొంగిలించారు. ఉక్రెయిన్​ ప్రజలకు బదులు గుర్తు తెలియని ప్రయాణికులతో ఆ విమానాన్ని దుండగులు ఇరాన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత మా ప్రజలను తీసుకొచ్చేందుకు మేము చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. మా ప్రజలు కాబుల్ విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. " అని ఉక్రెయిన్ సహాయ మంత్రి యెవ్​గెనీ యెనిన్​ వివరించారని టాస్​ పేర్కొంది. హైజాకర్ల వద్ధ ఆయుధాలు ఉన్నాయని ఆయన చెప్పారని .. మిగతా విషయాలు మాత్రం వెల్లడించలేదని తెలిపింది.

కాబుల్​కు(Kabul Airport) ఉక్రెయిన్ పంపిన మరో మిలిటరీ విమానం మాత్రం ఆదివారం సురక్షితంగా తిరిగివెళ్లింది. అందులో 83 మంది ప్రయాణికులుండగా.. వారిలో 31మంది ఉక్రెయిన్ పౌరులు. అఫ్గాన్ నుంచి ఇంకా 100 మందిని తరలించాల్సి ఉందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నట్లు టాస్​ తెలిపింది.

అసత్యం..

అయితే విమానం హైజాక్(​Ukraine Plane) వార్తలను ఉక్రెయిన్, ఇరాన్ ఖండించినట్లు జెరుసలెం పోస్ట్​ వార్తా సంస్థ వెల్లడించింది. విమానం మషద్​లో ఇంధనం కోసం మాత్రమే ఆగిందని, ఆ తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్​కు వెళ్లిపోయిందని ఇరాన్​ పౌరవిమానయాన శాఖ స్పష్టం చేసినట్లు పేర్కొంది.

మరోవైపు విమానం హైజాక్ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఉక్రెయిన్ మీడియా తెలిపింది. కాబుల్​లో గానీ మరెక్కడా గానీ విమానం హైజాక్​ కాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికెలెంకో చెప్పినట్లు పేర్కొంది. తమ పౌరులను తరలించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో చేప్పేందుకే విదేశాంగ మంత్రి ​ప్రయత్నించినట్లు ఒలెగ్ వివరించారని చెప్పింది.

Last Updated : Aug 24, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.