ఫిలిప్పీన్స్‌లో విమానం కూలిన ఘటనలో 31 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పౌరులున్నట్లు తెలుస్తోంది. మిగతావారంతా ఆర్మీ జవాన్లు. 50 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
రన్‌వే పై...
సైన్యానికి చెందిన సీ-130 విమానం ప్రమాదానికి గురైనట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ సిరిలిటో సోబెజనా తెలిపారు. ఆ విమానం.. సులు ప్రావిన్స్‌లోని కొండప్రాంతానికి సమీపంలో.. రన్‌వేపై అదుపు తప్పి కూలిపోయిందని వెల్లడించారు. దక్షిణ కాగయాన్ డీ ఓరో నగరం నుంచి భద్రతా సిబ్బందిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సోబెజనా చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 92 మంది ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు అందులోని 50 మందిని కాపాడినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.