ETV Bharat / international

రెస్టారెంట్​ భవనం కూలి 17 మంది మృతి - china news

చైనా షాంక్సీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్​ భవనం కూలిపోయి 17 మంది మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

restaurant collapses in China
కూలిన రెస్టారెంట్​ భవనం
author img

By

Published : Aug 29, 2020, 6:17 PM IST

Updated : Aug 29, 2020, 8:20 PM IST

ఉత్తర చైనాలోని షాంక్సీ రాష్ట్రంలో ఓ రెస్టారెంటు భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

లిన్ఫెన్​ నగరంలోని జియాంగ్​ఫెన్​ ప్రాంతంలో ఉదయం 9:40 గంటల ప్రాంతంలో రెస్టారెంటు నిర్వహిస్తోన్న రెండంతస్తుల భవనం కూలిపోయినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఇప్పటివరకు 45 మందిని బయటకుతీసినట్లు నివేదించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భవనం కూలిపోయేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!

Last Updated : Aug 29, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.