ETV Bharat / international

30 మంది తాలిబన్లను మట్టుబెట్టిన అఫ్గాన్​ సైన్యం!

author img

By

Published : Nov 30, 2020, 8:08 AM IST

చర్చల్లో పురోగతి కనిపిస్తోందనకున్న తరుణంలోనే.. భద్రతాబలగాలపై మరోసారి దాడికి యత్నించారు తాలిబన్లు. అయితే.. ఈ దాడిని ఆ దేశ సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. 30 మంది తాలిబన్లను మట్టుబెట్టింది.

30 Taliban members killed, 17 injured in clashes with Afghan forces in East
30 మంది తాలిబన్లను మట్టుబెట్టిన అఫ్గాన్​ సైన్యం

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లకు, సైనిక బలగాలకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు తాలిబన్​ కమాండర్లు సహా 30 మంది ముష్కరులు హతమయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు. అఫ్గాన్​​ తూర్పు రాష్ట్రం లాఘ్​మన్​లో ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

లాఘ్​మన్​లోని దవ్లాత్​ షా జిల్లాలో సైనికులపై మష్కరులు దాడికి యత్నించారు. ఈ దాడిని భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. జిల్లా తాలిబన్​ ఛీప్​తో పాటు ఆరుగురు స్థానిక కమాండర్లను అధికారులు అరెస్టు చేశారు.

ఖతార్​లో తాలిబన్లకు, అఫ్గాన్​ ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు సెప్టెంబర్​లో ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ.. అక్కడ హింసాత్మక ఘర్షణలు చెలరేగడం తగ్గలేదు. ఎన్నోరాష్ట్రాల్లో భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.