అఫ్గానిస్థాన్‌లో భద్రతా దళాలు, తాలిబన్లకు మధ్య భీకర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది తాలిబన్లు హతమయ్యారు. బదాక్షన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు సైనికులు సైతం ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, అఫ్గాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. ఈ రాష్ట్రంలోని కిషిమ్, తక్షన్, షహర్ ఏ బుజార్గ్, తగాబ్ జిల్లాలను తమ అధీనంలోకి తీసుకున్నాయని స్థానికులు తెలిపారు. అయితే, ఈ వార్తలను బదాక్షన్ ప్రభుత్వ ప్రతినిధి నిక్ మొహమ్మద్ నజారీ ఖండించారు. తాలిబన్లతో పోరాటం కొనసాగుతోందని చెప్పారు.
అమెరికా సహా విదేశీ సైన్యం దేశం విడిచి వెళ్లిపోతున్న నేపథ్యంలో అఫ్గాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. పౌరులకు వ్యతిరేకంగా హింసకు పాల్పడుతున్నారు.
ఇదీ చదవండి: