అఫ్గానిస్థాన్‌లో 19 మంది తాలిబన్లను మట్టుబెట్టింది ఆ దేశ వాయుసేన. వీరిలో తాలిబన్ అగ్రనేత ముల్లా అమానుల్లా కూడా ఉన్నారు. హెల్మాండ్ ప్రావిన్స్‌లో జరిగిన వైమానిక దాడిలో తన 8 మంది సహచరులు సహా అమానుల్లా హతమయ్యాడు. భారీ సంఖ్యలో ఆయుధాలనూ నాశనం చేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి తెలిపారు.
ఉత్తర ఫరియాబ్ ప్రావిన్స్‌లోని కైసర్ జిల్లాలో 10 మంది తాలిబన్లు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గడిచిన కొన్ని రోజులుగా హెల్మాండ్, కాందహార్, ఉరూజ్ ప్రావిన్సుల్లో ప్రభుత్వ బలగాలు, తాలిబన్ల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై తాలిబన్లు ఇప్పటివరకు స్పందించలేదు.
ఇదీ చూడండి: రెండోసారి లాక్డౌన్ దిశగా బ్రిటన్ అడుగులు!