ETV Bharat / international

గనిలో చిక్కుకుని 18మంది మైనర్లు మృతి​ - గనిలో ప్రమాదం

చైనా యోంగ్​చువాన్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో చిక్కుకుని 18మంది మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. గని లోపల కార్బన్​ మోనాక్సైడ్​ స్థాయు పరిమితి మించటం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Coal mine accident
బొగ్గు గని ప్రమాదం
author img

By

Published : Dec 5, 2020, 12:24 PM IST

Updated : Dec 5, 2020, 12:38 PM IST

చైనాలోని యోంగ్​చువాన్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చాంగ్​కింగ్​ మున్సిపాలిటీ పరిధిలోని డియోషుయిడాంగ్​ బొగ్గు గనిలో చిక్కుకుని 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వారంతా మైనర్లు కావటం గమనార్హం. మరో ఐదుగురు గనిలోనే చిక్కుకుపోయినట్లు సమాచారం. కార్బన్​ మోనాక్సైడ్​ స్థాయి పరిమితి మించి పెరిగిపోవటం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

గని లోపల మండుతున్న బొగ్గుతో కార్బన్​ మోనాక్సైడ్​ స్థాయిలు భద్రతా పరిమితిని మించి పోయాయని, 23 మంది అందులోనే చిక్కుకుపోవటం వల్ల ప్రమాదం జరిగినట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా వెల్లడించింది.

రెస్క్యూ బృందాలు, పోలీసులు, అగ్నిమాపక దళాలు.. గనిలో చిక్కుకున్న మైనర్లను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేపట్టాయి. అయితే.. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

డియోషుయిడాంగ్​ బొగ్గు గనిని 1975లో ప్రారంభించారు. 1998లో దానిని ప్రైవేటుపరం చేశారు. ఇందులో ఏడాదికి 120,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 2013, మార్చిలో ఇదే గనిలో హైడ్రోజన్​ సల్ఫైడ్​ విషవాయువుతో ముగ్గురు మరణించినట్లు జిన్హువా తెలిపింది.

ఇదీ చూడండి: బ్రెజిల్​లో ఘోర ప్రమాదం- 10 మంది మృతి

Last Updated : Dec 5, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.