ETV Bharat / international

శ్రీలంకపై ఉగ్రపంజా- 215 మంది బలి

ప్రపంచమంతా ఈస్టర్ వేడుకలు సాగుతున్న వేళ  శ్రీలంక బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇప్పటివరకూ జరిగిన 8 వరుస పేలుళ్లలో 215 మంది మృతి చెందారు. 500 మందికిపైగా గాయపడ్డారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లే లక్ష్యంగా దుండగులు దాడులకు తెగబడ్డారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రభుత్వం శ్రీలంకవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసు అధికారులు.

author img

By

Published : Apr 21, 2019, 5:31 PM IST

Updated : Apr 21, 2019, 8:02 PM IST

శ్రీలంకపై ఉగ్రపంజా
శ్రీలంకపై ఉగ్రదాడి

ఈస్టర్ పండుగ నాడు ఉగ్రమూకలు శ్రీలంకలో మరణకాండ సృష్టించాయి. రాజధాని కొలంబో సహా ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు తెగబడ్డాయి. ఇప్పటివరకూ 8 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 215 మంది చనిపోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో 3 చర్చిలు, 3 ఐదు నక్షత్రాల హోటళ్లలో బాంబుదాడులతో విరుచుకుపడ్డారు దుండగులు. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బట్టికలోవాలోని చర్చిలో విధ్వంసకాండ సృష్టించారు.

శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి ఐదు నక్షత్రాల హోటళ్లలో పేలుళ్లు జరిగాయి.

తేరుకునే లోపు మరో రెండు...

6 వరుస పేలుళ్ల నుంచి తేరుకునే లోపు మరో 2 పేలుళ్లకు ముష్కరులు తెగబడ్డారు. కొలంబోలోని దక్షిణ శివారు ప్రాంతంలో 7వ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తర శివారు​ ప్రాంతంలో ఓ ఇంట్లో గాలింపు చర్యలకు వెళ్లిన భద్రతా బలగాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు.
ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు బాధ్యత వహించలేదు.

ప్రభుత్వం అప్రమత్తం...

వరుస పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని రణిల్‌ విక్రమసింఘే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. మరికొన్ని చోట్ల దాడులు జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య ప్రాంతాల్లో భారీగా సైనిక బలగాలను మోహరించారు.

దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, సామాజిక మాధ్యమాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. ప్రభుత్వ పాఠశాలలకు సోమ, మంగళవారాలు సెలవు ప్రకటించారు.

భయం గుప్పిట్లో...

బండారు నాయికే అంతర్జాతీయ విమానాశ్రయానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు, ప్రత్యేక కార్యదళం, అదనపు పోలీసు బలగాలు విమానాశ్రయం చుట్టూ కంచెలా రక్షణనిస్తున్నాయి.

ప్రజల అయోమయం...

తాజా పరిస్థితితో శ్రీలంక ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఎక్కడ, ఎప్పుడు బాంబు పేలుతుందో తెలియక భయానక వాతావరణం ఏర్పడింది. ప్రజలు బయటకు రావాలంటే హడలిపోతున్నారు.

AP Video Delivery Log - 1000 GMT News
Sunday, 21 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0952: Sri Lanka Prime Minister No access Sri Lanka 4207072
Sri Lanka PM reacts to deadly Easter blasts
AP-APTN-0951: Ukraine OSCE AP Clients Only 4207077
OSCE monitors say run off election 'going smoothly'
AP-APTN-0950: Ukraine Poroshenko AP Clients Only 4207076
Poroshenko votes in Ukrainian run-off poll
AP-APTN-0947: Sri Lanka Hotel Blast 2 Part no access Sri Lanka 4207073
Damage at hotel, Colombo Archbishop reacts
AP-APTN-0911: Sri Lanka Church Blasts No access Sri Lanka 4207069
Damage at churches in Negombo and Batticaloa CLEAN
AP-APTN-0907: Egypt Referendum AP Clients Only 4207068
Voting underway on 2nd day of Egypt referendum
AP-APTN-0837: MidEast Sri Lanka AP Clients Only 4207066
Christians in Jeruslam react to Sri Lanka blasts
AP-APTN-0834: Ukraine Zelenskiy AP Clients Only 4207065
Zelenskiy votes in Ukrainian run-off poll
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 21, 2019, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.