థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు రోడ్డుపై మలుపు తిరుగుతుండగా బోల్తాపడింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. మృతుల్లో అత్యధికులు విద్యార్థులే.
ఇదీ జరిగింది...
మెకానిక్ల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ స్థానిక కంపెనీలో తమ శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకుని ట్రక్కులో తిరుగుపయనమయ్యారు. విద్యార్థులతో పాటు మరికొందరు ప్రొఫెసర్లు ట్రక్కులోనే ఉన్నారు. ఈ సమయంలో రోడ్డుపై మలుపు తిరుగుతుండగా ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో 13మంది దుర్మరణం పాలయ్యారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇదీ చూడండి : దారికి అడ్డొచ్చిన ఆవులు- ఐదుగురు మృతి