ఉత్తర చైనా శాంక్సీలో ఓ దుర్ఘటన జరిగింది. ఐరన్ మైన్లో చిక్కుకుని 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
జూన్ 10న జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారందరి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు 1,084 మంది సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
చైనాలో బొగ్గు గనులు అత్యంత ప్రమాదకారిగా మారుతున్నాయి. 2009లో ప్రపంచవ్యాప్తంగా.. బొగ్గు గనుల్లో మరణించిన వారి సంఖ్య అత్యధికంగా చైనాలోనే ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి:చైనా కుటుంబ నియంత్రణ.. వరమా? శాపమా?