ETV Bharat / international

'వరల్డ్ వార్ 2' సమయంలో తల్లికి ఉత్తరం.. 76ఏళ్ల తర్వాత డెలివరీ - వరల్డ్ వార్ 2 సమయంలో తల్లికి లేఖ

World War 2 Letter Delivery: ఎప్పుడో 76 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ సైనికుడు.. తన తల్లికి పంపించిన ఉత్తరం ఇప్పటికి డెలివరీ అయింది. అదేంటి? లెటర్ డెలివరీ చేయడానికి ఇన్నేళ్లు పట్టిందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి మరి.

world war 2 letter delivery
'వరల్డ్ వార్ 2' సమయంలో తల్లికి లేఖ
author img

By

Published : Jan 7, 2022, 1:17 PM IST

World War 2 Letter Delivery: అమెరికాలో జరిగిన ఈ యథార్థ సంఘటన వింటే ఎవరికైనా శివమణి సినిమాలో ఉత్తరం సీన్ గుర్తురావాల్సిందే..! ఎప్పుడో 76 ఏళ్ల క్రితం ఓ సైనికుడు తన తల్లి యోగక్షేమాలను అడుగుతూ పంపించిన ఉత్తరం.. ఇటీవల చేరాల్సిన చోటుకు చేరింది. కానీ రాసినవారు, తీసుకోవాల్సినవారు ఇద్దరూ లేరు.

ఏం జరిగిందంటే..?

1945 డిసెంబర్​.. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులవి. ఆ సమయంలో అమెరికాకు చెందిన ఆర్మీ ఎస్​జీటీ జాన్ గోన్​సల్వేస్(అప్పటి వయసు 22) జర్మనీలో ఉండేవారు. మసాచుసెట్స్​ రాష్ట్రం వోబర్న్​లో ఉండే తన తల్లికి యోగక్షేమాలను అడుగుతూ లేఖ రాశారు.

" డియర్​ మామ్. ఈరోజు నీ నుంచి మరొక లేఖ నా వద్దకు వచ్చింది. అంతా బాగానే ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను బాగానే ఉన్నాను. లవ్​ అండ్ కిస్సెస్. మీ జానీ. త్వరలోనే నేను నిన్ను చూస్తాను అని అనుకుంటున్నా."

-- ఉత్తరంలోని మాటలు

జాన్​ పంపించిన ఈ లేఖ 76 ఏళ్లుగా పిట్స్​బర్గ్​లోని యూఎస్ పోస్టల్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీ(యూఎస్​పీఎస్​) కేంద్రంలోనే ఉంది. ఇన్నేళ్లుగా ఉత్తరాన్ని ఎవరూ చూడలేదు.

2015లో జాన్ గోన్​సల్వేస్ మరణించగా, అప్పటికే అతని తల్లికూడా మృతిచెందారు. అయితే.. యూఎస్​పీస్​ ఉద్యోగులు ఇటీవల ఈ లేఖను గుర్తించి.. జాన్ సతీమణి ఏంజెలీనాకు(89) పంపించారు.

ఆ ఉత్తరంతో పాటు.. "ఈ లేఖను డెలివరీ చేయడం మాకు ఎంతో ముఖ్యం."అని చెబుతూ మరో ఉత్తరాన్ని పంపించారు. లేఖ అందాక సంబంధిత ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపింది గోన్​సల్వేస్ కుటుంబం.

"నేను ఇది నమ్మలేకపోతున్నా. ఒక్కసారి ఆలోచించండి ఆ లేఖకు 76ఏళ్లు. ఇది చాలా అద్భుతం. జాన్​ మరోసారి తనకోసం వచ్చినట్లు ఉంది." అని భావోద్వేగానికి లోనయ్యారు ఏంజెలీనా.

ఇదీ చూడండి: కరోనా ధాటికి అమెరికా విలవిల.. ఫ్రాన్స్​లో 3లక్షల కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.