ETV Bharat / international

అమెజాన్​, ఉద్యోగుల మధ్య 'యూనియన్' రగడ - ఉద్యోగ సంఘాల ఏర్పాటుపై బైడెన్ ప్రకటన

వ్యాపారాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అమెజాన్ ఇప్పుడు ఉద్యోగుల పట్ల తన వైఖరితో వివాదంలో చిక్కుకుంది. ఉద్యోగులు సంస్థను విమర్శిస్తుండటం, వారికి ప్రముఖుల మద్దతు లభించడం వల్ల ఇప్పుడు అమెరికావ్యాప్తంగా ఈ అంశంపై తీవ్ర చర్చసాగుతోంది. ఇంతకీ అమెజాన్​కు, ఆ సంస్థ ఉద్యోగుల మధ్య వివాదమేంటి? ఈ వివాదంపై ఉద్యోగులు, అమెజాన్ వాదనలేంటి?

Amazon Employees Union Controversy
అమెజాన్ ఉద్యోగుల యూనియన్ వివాదం
author img

By

Published : Mar 18, 2021, 2:00 PM IST

అమెజాన్.. ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అమెరికాలో అత్యధిక ఉద్యోగులున్న రెండో అతిపెద్ద ప్రైవేటు సంస్థ కూడా ఇదే. 1994లో తొలుత పుస్తకాల డెలివరీతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్థానం ఇప్పుడు ఎలాంటి వస్తువైనా.. అమెజాన్​లో దొరుకుతుంది అనే స్థాయికి చేరింది. 26 ఏళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లను దాటుకుని ఈ స్థాయికి చేరింది అమెజాన్​.

అయితే వ్యాపారాల్లో పోటీ, ఇతర కారణాలతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న అమెజాన్ ఇప్పుడు.. సొంత ఉద్యోగుల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలతో వివాదంలో చిక్కుకుంది. ఉద్యోగులు సంస్థను విమర్శిస్తుండటం, వారికి ప్రముఖుల మద్దతు లభించడం.. సిబ్బందికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు.. ఇవన్నీ ఇప్పుడు అమెజాన్​కు తలనొప్పిగా మారాయి.

పని విధానాలు, వేతనాలు సహా వివిధ అంశాల్లో అమెజాన్​పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఇదే అభిప్రాయంతో ఉన్నవారంతా ఓ యూనియన్​ ఏర్పాటు చేయాలనుకోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణం.

వివాదానికి ప్రారంభమిది..

అలబామా బెస్సెమెర్​లో ఉన్న అమెజాన్ వేర్​హౌస్​ నుంచి ఈ వివాదం ప్రారంభమైంది. వేతనాలు, పని పరిస్థితులు సహా ఇతర అంశాల్లో అక్కడి ఉద్యోగులు కొంత కాలంగా కంపెనీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులంతా కలిసి యూనియన్​గా ఏర్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన కంపెనీ యూనియన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించింది. దీనితో ఉద్యోగులు, సంస్థ మధ్య వివాదం మరింత ముదిరింది.

ఉద్యోగ సంఘం ఏర్పాటుకు వ్యతిరేకంగా, అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందంటూ.. అలబామా బెస్సెమెర్​లోని ఓ అమెజాన్​ ఉద్యోగి బహిరంగంగానే విమర్శలు చేశారు.

'ఉద్యోగులంతా యూనియన్​గా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలిసి మా వేర్​హౌస్​లో, బాత్​రూమ్​లలో కూడా 'నో ప్లేస్​ వజ్​ ఆఫ్ లిమిట్స్​' అనే యాంటీ యూనియన్​ సైన్​లను కంపెనీ ఏర్పాటు చేసింది' అని జెన్నిఫర్​ బేట్స్​ అనే ఉద్యోగి తెలిపారు. వేతనాల్లో అసమానతల కేసుకు సంబంధించి వాషింగ్టన్​ కోర్టులో విచారణలోనూ జెన్నిఫర్ సాక్షిగా ఉన్నారు.

వరుస సమావేశాలు

ఉద్యోగులతో అమెజాన్​ యాజమాన్యం వరుస సమావేశాలు నిర్వహిస్తూ... యూనియన్​గా ఏర్పడితే ఏం జరుగుతుందో పదేపదే చెబుతోందని అంటున్నారు జెన్నిఫర్.

'యూనియన్​గా ఏర్పడితే తమకే (ఉద్యోగులకు) నష్టమని కంపెనీ ఏవేవో కారణాలు చెబుతోంది. కంపెనీ చెప్పిన విషయాలతో ఏకీభవించకుండా.. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే.. సమావేశాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు' అని జెన్నిఫర్​ చెప్పుకొచ్చారు.

అమెజాన్​ చాలా ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. బెస్సేమెర్​లో ఉద్యోగుల సంఘం ఏర్పాటు విజయవంతమైతే.. దేశవ్యాప్తంగా ఇతర యూనిట్లలోనూ ఉద్యోగులు యూనియన్​గా ఏర్పడతారు. దీనితో వారంతా సరైన పని వసతుల కోసం డిమాండ్ చేస్తారని కంపెనీ భయపడుతోదని ఉద్యోగులు అంటున్నారు.

అలబామా యూనిట్​లో ఉద్యోగ సంఘం ఏర్పాటు విజయవంతమవుతుందని కార్మిక న్యాయవాదులు కూడా ఆశావాదంతో ఉన్నారు. అయితే కంపెనీ నుంచి ఇందుకు ఆటంకాలు ఏర్పడేందుకూ అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రయత్నాలను అణచివేసిన చరిత్ర ఈ కంపెనీకి ఉందన్నది వారి మాట.

అమెజాన్ వాదన ఇది..

వేర్​హౌస్​లలో, బాత్​రూమ్​లలో సైన్​ల ఏర్పాటు, ఉద్యోగులతో సమావేశాల ఏర్పాటు నిజమేనని అమెజాన్ కూడా అంగీకరించింది. అయితే తమ కంపెనీ.. నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్​ నిబంధనలు, అలబామా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. యూనియన్​లో చేరినా, చేరకున్నా వారి(ఉద్యోగుల) హక్కులను మాత్రం గౌరవిస్తామని పేర్కొంది.

'వందలు వేలల్లో ఉన్న ఉద్యోగులు గళమెత్తేందుకు మా ప్రోత్సాహం ఉంటుంది. మా ఉద్యోగులు గంటకు కనీసం 15 డాలర్లు సంపాదించగలుగుతున్నారు. వాటితోపాటు హెల్త్​కేర్​, వేతనాలతో కూడిన సెలవు వంటి ప్రయోజనాలు పొందగలుగుతున్నార'ని అమెజాన్ వెల్లడించింది.

జెన్నిఫర్​ బేట్స్ ఫీడ్​బ్యాక్​ను పరిగణనలోకి తీసుకోనున్నట్లు అమెజాన్ పేర్కొంది. అయితే ఇతర ఉద్యోగులందరి తరఫు అభిప్రాయాలను కూడా ఆమే వ్యక్తం చేసినట్లు కాదని వివరించింది.

యూనియన్​ ఏర్పాటుకు ఓటింగ్..

యూనియన్ కావాలా? వద్దా? అనే అంశంపై అలబామా వేర్​హౌస్ ఉద్యోగులకు ఈ నెలాఖరు వరకు సమయముంది. యూనియన్ ఏర్పాటుకు అమెరికాలోని పలువురు సెనేటర్లు, పలు రాష్ట్రాల గవర్నర్లు సహా కొంత మంది ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉద్యోగ సంఘం ఏర్పాటుపై ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులు యూనియన్​గా ఏర్పడే విషయం కంపెనీకి చెప్పాల్సిన అవసరం లేదని.. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. అయితే ఆయన మాటల్లో ఎక్కడా అమెజాన్ ప్రస్తావన రాలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.