ETV Bharat / international

ట్విట్టర్​కు దీటుగా ట్రంప్​ కొత్త యాప్​!

author img

By

Published : Jan 9, 2021, 12:57 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ట్విట్టర్​ ప్రకటించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వాక్‌ స్వాతంత్య్రాన్ని హరిస్తోందని వ్యాఖ్యానించారు. డెమొక్రాట్లు, ర్యాడికల్‌ లెఫ్ట్‌తో ట్విట్టర్​ ఉద్యోగులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. త్వరలో సొంతంగా ఓ సామాజిక మాధ్యమాన్ని రూపొందించడానికి ఉన్నసాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.

Trump after Twitter ban
ట్విట్టర్​కు దీటుగా ట్రంప్​ కొత్త యాప్​!

ట్విట్టర్ తన ఖాతాను శాశ్వతంగా నిషేధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తప్పుబట్టారు. తనతో పాటు తనకు ఓటేసిన 7.5 కోట్ల మంది గళాన్ని నొక్కేందుకు ట్విట్టర్​ ప్రయత్నిస్తుందన్నారు. అయితే ఈ విషయంపై తాము మౌనంగా ఉండబోమని ట్రంప్ అన్నారు. సొంతంగా ఓ సామాజిక మాధ్యమాన్ని రుపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

తన వ్యక్తిగత ఖాతాను నిషేధించడం వల్ల అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ‌(ప్రెసిడెంట్‌ ట్రంప్‌) ద్వారా ట్రంప్ ఈ మేరకు‌ స్పందించారు.

"ట్విట్టర్‌ వాక్‌ స్వాతంత్య్రాన్ని హరిస్తోంది. డెమొక్రాట్లు, ర్యాడికల్‌ లెఫ్ట్‌తో ట్విట్టర్​ ఉద్యోగులు కుమ్మక్కయ్యారు. ట్విట్టర్ ఓ ప్రైవేట్‌ కంపెనీ.. ప్రభుత్వం దాఖలు పరిచే సెక్షన్‌ 230 లేకుంటే వారు ఎక్కువకాలం మనుగడ సాగించలేరు.

త్వరలో ఓ భారీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. సొంతంగా ఓ సామాజిక మాధ్యమాన్ని రూపొందించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇతర వెబ్‌సైట్లతో మాట్లాడుతున్నాం. తమ గళాన్ని ఎవరూ నొక్కేయలేరు. "

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఈ ట్వీట్లను కూడా ట్విట్టర్‌ వెంటనే తొలగించడం గమనార్హం. 'ప్రెసిడెంట్‌ ట్రంప్‌' ప్రభుత్వ ట్విట్టర్‌ ఖాతా కావడం వల్ల నిషేధం విధించలేకపోయింది.

శాశ్వత నిషేధం..

ట్రంప్ తన సందేశాల ద్వారా మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందనే కారణంతో ట్విట్టర్​ ఆయన వ్యక్తిగత ఖాతాపై శాశ్వత నిషేధం విధించింది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.