వెనెజువెలాలోని మిలటరీ అకాడమీలో యూత్ ఆర్కెస్ట్రా (Venezuela youth orchestra) నిర్వహించిన కచేరి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ఏకకాలంలో 8,097 మంది వాయిద్యకారులు చేసిన సంగీత కచేరీ.. 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' (Worlds largest Orchestra) అధికారుల దృష్టిని ఆకర్షించింది. వేలాది మంది సంగీతకారులు, వందలాది పియానోలు, వయోలిన్లు, డ్రమ్స్ మోగిస్తూ చేసిన ప్రదర్శన సంగీత ప్రియులను కట్టి పడేసింది. ఈ ప్రదర్శనకు అధికారికంగా గుర్తింపునివ్వడంపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు గిన్నిస్ బుక్ (Orchestra Guinness record) అధికారులు తెలిపారు.

చిన్నారులు, టీనేజ్ యువకులే!
ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు వెనెజువెలా నలుమూలల నుంచి సంగీతకారులు (Venezuela youth orchestra) తరలివచ్చారు. సంగీతంలో.. ప్రపంచ రికార్డు సాధించాలన్న ఉద్దేశంతో వెనెజువెలా (Biggest Orchestra in the world) దేశభక్తి గీతాన్ని 10 నిమిషాల పాటు ప్రదర్శించారు. కచేరిలో పాల్గొన్న వారిలో అత్యధికులు చిన్నారులు, టీనేజ్ యువకులే ఉన్నారు.

12 వేలు అనుకుంటే..
అయితే ఈ రికార్డు స్థాయి సంగీత కచేరికి (Guinness World record Orchestra) మెుత్తం 12వేల మంది సంగీతకారులను సమీకరించాలని వెనెజువెలా మ్యూజిక్ నెట్‌వర్క్ ఈ సిస్టెమా భావించింది. కానీ అనుకున్న దాని కంటే తక్కువ మంది వాయిద్య కారులు సంగీత ప్రదర్శనకు హాజరయ్యారు.

2 నెలల నుంచి శిక్షణ
రికార్డు స్థాయి కచేరిని పరిశీలించేందుకు మొత్తం 250 మంది సూపర్‌వైజర్లు పనిచేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వీరు సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీతకారులను లెక్కించేందుకు నెంబర్లు ఉన్న సీట్లను వారికి కేటాయించారు. మరోవైపు ఈ భారీ కచేరిని ఏకకాలంలో చేసేందుకు.... 2 నెలల ముందు నుంచే సంగీతకారులు శిక్షణ పొందినట్లు నిర్వహకులు తెలిపారు.

ఇదీ చదవండి: సంగీతంలో అద్భుతాలు- కళ్లకు గంతలతో కీబోర్డు తిరగేసి మరీ..