ETV Bharat / international

ఒకేసారి ఆరు వాహనాలు ఢీ- తొమ్మిది మంది మృతి - ఆరు వాహనాలు ఢీకొన్న ఘటన

Vehicle Crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Vehicle Crash
Vehicle Crash
author img

By

Published : Jan 30, 2022, 4:16 PM IST

Vehicle Crash: అమెరికాలో నెవాడా రాష్ట్రం లాస్​ వెగాస్​లో ఘోరో ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పాయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులంతా యుక్తవయసు వారేనని వెల్లడించారు.

స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది చిక్కుకున్నారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొట్టడమే ఈ ఘటనకు కారణమని నార్త్​ లాస్​ వెగాస్​ పోలీసు అధికారి అలెగ్జాండర్ క్యూవాస్​ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: టీకా వ్యతిరేక ఆందోళనలు.. రహస్య ప్రదేశానికి ఆ దేశ ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.