చైనాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో తాము నిర్మాణాత్మక సంబంధాలనే కోరుకుంటున్నామన్న ట్రంప్.. ఆ దేశ మొండి వైఖరితో తన వాగ్దానాలను ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉందని ఆరోపించారు.
"చైనాతో సత్సంబంధాలను అమెరికా ఆకాంక్షిస్తోంది. చైనా మాత్రం అమెరికాతోనే కాకుండా పలు దేశాలతో ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిలో జోక్యం చేసుకోకూడదని ఇటీవల చైనాకు సూచించింది అమెరికా. దీనిపై ఐరాస భద్రతా మండలి సమావేశం కావాలని పిలుపునిచ్చారు. అయినా.. చైనా ధోరణిలో ఏ మాత్రం మార్పులేదు. హాంకాంగ్‌లో జాతీయ భద్రత చట్టాన్ని అమలు చేసే దిశగానే చైనా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పార్లమెంటు కూడా దీనిని ఆమోదించింది.
ఇదీ చూడండి: 'కరోనా నుంచి మేం కోలుకుంటున్నాం.. అమెరికా కష్టం'