ఐదు లక్షల విద్యుత్ వాహన(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని బైడెన్ సర్కార్ యోచిస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఈవీలను భారీఎత్తున రోడ్డు ఎక్కించి.. వాతావరణ కాలుష్య సంక్షోభం నుంచి బయటపడేందుకు, ఆర్థిక పునరుద్ధరణ సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.
"ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సంస్థల సీఈఓలతో జాతీయ వాతావరణ సలహాదారు గినా మెక్కార్తీ సహా పలు సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు ఇప్పటికే వర్చువల్ సమావేశం నిర్వహించారు. దేశీయ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి.. అమెరికన్ తయారీని పెంచే పెట్టుబడులపై అధ్యక్షుడు జో బైడెన్ నిబద్ధతను మెక్కార్తీ ఈ భేటీలో వివరించారు. వాహనాల విద్యుదీకరణతో ఉద్యోగాల సృష్టి జరుగుతోందని పేర్కొన్నారు. ఇందుకోసం 5 లక్షల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈవీల ప్రాముఖ్యంపై చర్చించిన ఆయా సంస్థల అధినేతలు.. ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సముఖంగా ఉన్నట్లు తెలిపారు" అని శ్వేతసౌధం వెల్లడించింది.
ఇదీ చూడండి: 'మే చివరినాటికి వయోజనులందరికీ కరోనా టీకా'