చైనా, రష్యా నుంచి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు బైడెన్ యంత్రాంగం రెండు దేశాలకు వేర్వేరు వ్యూహాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. చైనాను కట్టడి చేసేందుకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని, శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడే ఆ దేశం పట్ల బైడెన్ వైఖరి స్పష్టమైందని అన్నారు.
"చైనా విషయంలో స్నేహపూర్వక దేశాలతో కలిసి పనిచేయాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. చైనాతో సంబంధాల విషయంపై భాగస్వామ్య దేశాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. బైడెన్.. పుతిన్‌కు ఫోన్ చేసినప్పుడే రష్యా విషయంలో ఆయన విధానం స్పష్టమైంది. ఫోన్లో మాట్లాడేటప్పుడు బైడెన్ వెనకడుగు వేయలేదు. అమెరికా భద్రతకు సంబంధించి ఏ విషయంలో కలిసి పనిచేయాలనే అంశంపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. న్యూస్టార్ట్(ఒప్పందం పొడిగింపు) ఒక ఉదాహరణ. రష్యా గురించి అనేక ఆందోళనలు ఉన్నాయి. ఎన్నికల్లో జోక్యం, హ్యాకింగ్, అమెరికన్ సైన్యంపై బౌంటీలు ప్రకటించడం వంటి సవాళ్లు నెలకొన్నాయి."
-జెన్ సాకి, శ్వేతసౌధ మీడియా కార్యదర్శి
రష్యా సహా పరస్పర ప్రయోజనం ఉన్న వివిధ అంశాలపై ఐరోపా దేశాలతో బైడెన్ చర్చించారని సాకి తెలిపారు. ఆంక్షలు విధించే అధికారం బైడెన్ ఉందని.. అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై పాలసీ బృందాలు చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి: 'భారత్-నేపాల్ సంబంధాలు ఎన్నడూ క్షీణించలేదు'