వారాంతంలో ఈ ప్రాంతానికి తుపాను ముప్పుందని తెలిపారు. మిస్సోరీ నదికి దిగువన నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
బుధవారం నుంచి శుక్రవారం మధ్యలో వచ్చే తుపాను వల్ల మిస్సోరి నదిలో అడుగుల మేర నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని తెలిపారు. ఫలితంగా నది దిగువ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడనుందన్నారు. మొత్తానికి ఎంత మేర నీటి ప్రవాహం పెరుగుతుందో అంచనా వేయలేకపోతున్నామని పేర్కొన్నారు.