ETV Bharat / international

'కరోనాతో ఇంకా జీవన్మరణ పోరులోనే అమెరికా'

కొవిడ్-19తో అమెరికా ఇంకా జీవన్మరణ పోరాటం చేస్తూనే ఉందని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్​ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలను కోరారు.

author img

By

Published : Apr 7, 2021, 10:01 AM IST

US still in life and death race against coronavirus: Biden
'కరోనాతో జీవన్మరణ పోరులో అమెరికా'

కరోనాతో అమెరికా ఇంకా జీవన్మరణ పోరాటం చేస్తూనే ఉందన్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. అయితే దానిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజలకు తన ప్రభుత్వం.. 75 రోజుల్లో 15కోట్ల డోసులు అందించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"కరోనాతో అమెరికా ఇంకా జీవన్మరణ పోరాటం చేస్తునే ఉంది. అందరికీ వ్యాక్సిన్​ అందేంత వరకూ ప్రజలు కరోనా నిబంధనలను పాటించటం మరవద్దు. మంచిరోజులు ముందున్నాయి. జులై నాటికి మనం మన కుటుంబం, స్నేహితులతో సంతోషంగా గడపబోతున్నాం."

-- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

అధికారం చేపట్టిన నాటి నుంచి.. వంద రోజుల్లో 20 కోట్ల టీకాలు అందించడమే లక్ష్యంగా బైడెన్​ బృందం ముందుకు సాగుతోంది.

ఏప్రిల్​ 19 నాటికి..

ఈ నెల​ 19 నాటికి దేశంలో వయోజనులందరికీ టీకా అందించే దిశగా అధ్యక్షడు జో బైడెన్​ సమాయత్తం అవుతున్నారని శ్వేతసౌధం ప్రెస్​ సెక్రటరీ జెన్​ సాకి తెలిపారు. మొదట మే 1 నుంచి వ్యాక్సిన్​ అందించాలని భావించినా.. కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ నెల​ 19 నుంచే అందరికీ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వివరించారు.

వ్యాక్సిన్​ తయారీ, సరఫరా ప్రక్రియను వేగవంతం చేయటంపై బైడెన్​ ప్రభుత్వం దృష్టి సారించిందని అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.

అమెరికా మౌనం...

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల తయారీ- సరఫరాకు అమెరికా కట్టుబడి ఉందని నెడ్​ వెల్లడించారు. అయితే.. కొవిడ్-19 వ్యాక్సిన్​లపై మేథోసంపత్తి హక్కులను ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) తొలగించాలని భారత్​, దక్షిణాఫ్రికా వంటి దేశాలు చేసిన విజ్ఞప్తిపై మాత్రం ఆయన స్పందించలేదు.

"ఈ విషయం(వ్యాక్సిన్ల మేథోసంపత్తి)పై మాకు ఆలోచనల్లో మార్పు లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయరీ, సరఫరాపై అధ్యక్షుడు బైడెన్​ దృష్టి సారించారు. అయితే.. అమెరికా ప్రజలకు వ్యాక్సిన్​ అందించటమే మా ప్రథమ కర్తవ్యం. కరోనా వల్ల మేము చాలా నష్టపోయాం."

-- నెడ్​ ప్రైస్​, అమెరికా విదేశాంగ మంత్రి

కొవిడ్​-19 కారణంగా మిగతా దేశాల కంటే అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించినట్లు నెడ్​ ప్రైస్​ తెలిపారు. అయితే అమెరికా ప్రజలకు సరిపడ వ్యాక్సిన్​ డోసులు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : చికాగోలో దారుణం- మూడేళ్ల బాలుడి తలపై కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.