ETV Bharat / international

కొవిడ్​ పరీక్ష చేసి.. స్మార్ట్​ఫోన్​కు సమాచారమిచ్చే చిప్​ - కొవిడ్​ స్మార్ట్​ఫోన్​ చిప్​

కరోనా నిర్ధరణ పరీక్షను మరింత సులభతరం చేశారు అమెరికన్​ శాస్త్రవేత్తలు. ప్రయోగశాల అవసరంలేని ఈ రకమైన టెస్టింగ్​ ద్వారా.. ఫలితాన్ని స్మార్ట్​ఫోన్​కు చేరవేసేలా సరికొత్త చిప్​ను రూపొందించారు. స్టాంపు పరిమాణంలో ఉండే ఈ మైక్రోప్లూడిక్​ పరికరం.. 55 నిమిషాల్లోనే ఫలితాన్ని వెల్లడిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

US Scientists develop a new chip that simplifies Covid test and sent the result to Smartphone
కొవిడ్​ పరీక్ష చేసి.. స్మార్ట్​ఫోన్​కు సమాచారమిచ్చే చిప్​
author img

By

Published : Feb 27, 2021, 7:41 AM IST

కొవిడ్​ నిర్ధరణ పరీక్షను సులభతరం చేయడమే కాకుండా.. ఫలితాన్ని స్మార్ట్​ఫోన్​కు పంపే సరికొత్త చిప్​ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. స్టాంపు పరిమాణంలో ఉండే ఈ మైక్రోప్లూడిక్​ పరికరం.. 55 నిమిషాల్లో ఫలితాన్ని వెల్లడిస్తుంది. రైస్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ఏసీఎస్​ సెన్సర్స్​ పత్రిక అందించింది.

"చిన్నపాటి రక్తపు బొట్టును పరిశీలించడం ద్వారా కరోనా సోకిన విషయాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. కొవిడ్​ బాధితుల రక్తంలో న్యూక్లియోకాప్సిడ్​ అనే ఎన్​-ప్రొటీన్​ అభివృద్ధి చెందుతుంది. మేము రూపొందించిన చిప్​లో నానోబీడ్స్​ను ఉంచాం. రక్త నమూనాల్లో ఎన్​-ప్రొటీన్లు ఉండే.. ఈ నానోబీడ్స్​ వాటితో అతుక్కుపోయి, చిప్​లో ఉన్న ఎలక్ట్రో-కెమికల్​ సెన్సర్లకు చేరవేస్తాయి. స్వల్ప పరిమాణంలో ఎన్​-ప్రొటీన్లు ఉన్నా.. 25 నిమిషాల్లోనే ఈ సెన్సర్లు సులభంగా గుర్తిస్తాయి. ఆ వెంటనే చిప్​తో అనుసంధానమైన గూగుల్​ పిక్సెల్​-2 ఫోన్​కు సమాచారం వస్తుంది." అని పరిశోధనకర్త పీటర్​ లిలెహోజ్​ వివరించారు.

ఈ పరీక్ష నిర్వహణకు ప్రయోగశాల అవసరం లేదని, ఈ చిప్​ను ఉపయోగించి రక్త నమూనాల సేకరణ వద్దే ఫలితాలను తెలుసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.

ఇదీ చదవండి: టీకా బాటలో వెనకబాటు- ఉరకలేస్తున్న ఇజ్రాయెల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.