వాణిజ్యం, కరోనా వ్యాప్తి అంశాల్లో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తోంది. తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సెమీకండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ఎస్ఎంఐసీ)కి ఎగుమతులపై నిషేధం విధించింది.
తమ పరికరాలను చైనా మిలిటరీ ఉపయోగిస్తే ప్రమాదమని చెబుతూ అమెరికా వాణిజ్య శాఖ ఈ చర్యలు చేపట్టిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. కంప్యూటర్ చిప్‌ల దిగుమతిలో అమెరికాపై చైనా భారీగా ఆధారపడింది. గత రెండేళ్లలో సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన చిప్‌లను దిగుమతి చేసుకుంది చైనా.
కొన్ని రోజులుగా చైనా సంస్థలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బైట్‌డాన్స్ (టిక్‌టాక్ మాతృసంస్థ), వీచాట్‌ను నిషేధిస్తూ ఆగస్టులో కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: నిషేధానికి కొద్ది గంటల ముందు టిక్‌టాక్‌కు ఊరట