అమెరికా- లూసియానాలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన తుపానుతో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను ప్రభావంతో ఉత్తర ఫ్లోరిడాలో బీభత్సమైన గాలులు వీచాయి. ఈ దెబ్బకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా ఎక్కడిక్కడే వాహనాలను నిలిపివేసిన అధికారులు.. ప్రవాహ ఉద్ధృతి తగ్గేవరకు పడవల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లుచేశారు.



తుపాను తాకిడితో మిసిసిపీ నదీ సమీపం, గ్రాండ్ ఐసిల్ మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. క్రిస్టబల్ నదీ తీరాన్ని తాకిన ఈ తుపాను ప్రభావంతో.. గంటకు 50 మైళ్ల(85 కిలోమీటర్ల) వేగంతో గాలులు వీచాయి. అయితే ఈ వేగం మరింత పెరిగి గంటకు దాదాపు 180 మైళ్ల(290 కిలోమీటర్లు)కు చేరుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

లూసియానా, మిసిసిపీ పరిసర ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షం కురవగా.. ప్రవాహం ఎత్తు 5 అడుగులు దాటింది.

ఇదీ చదవండి: జాతి వివక్షపై గొంతెత్తిన ప్రపంచం.. పలు దేశాల్లో నిరసనలు