ETV Bharat / international

అమెరికా అధ్యక్షుల ప్రమాణం.. పదనిసలు!

నిరసనకారుల నుంచి దాడుల ముప్పు.. జనవరి మాసపు చలి.. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి అంతకు ముందు అమెరికా అధ్యక్షులు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ప్రమాణం చేశారో ఇప్పుడు చూద్దాం.

author img

By

Published : Jan 20, 2021, 7:31 AM IST

us previous presidents inauguration events
అగ్రరాజ్య అధ్యక్షుల ప్రమాణం.. పదనిసలు!

బుధవారం జరగనున్న.. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ కోసం యావత్​ ప్రపంచ మంతా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో అంతకుముందు అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు ఎలా జరిగాయంటే..

తొలి ప్రమాణం

1789లో అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌... న్యూయార్క్‌ సిటీలోని ఫెడరల్‌ హాల్‌లో ప్రమాణం చేశారు.

అస్వస్థతతో..

1841లో... తొమ్మిదో అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన విలియం హెన్రీ హారిసన్‌ వెంటనే... గజగజలాడించిన చలిలో బహిరంగ వేదికమీది నుంచి ప్రసంగించారు. ఆ చలికి ఆరోగ్యం దెబ్బతిని... అస్వస్థుడై 32 రోజుల్లో కన్నుమూశారు.

బైడెన్‌లానే లింకన్‌ కూడా..

ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా పేర్కొనే అబ్రహం లింకన్‌ అధ్యక్షుడైనప్పుడు కూడా అమెరికా అతలాకుతలమైంది. అంతర్యుద్ధం అంచుల్లో ఉన్న ఆ తరుణంలో 1861లో లింకన్‌ ప్రమాణ స్వీకారం చేయటమేగాకుండా.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య క్యాపిటల్‌లో తన ఆరంభోపన్యాసం ఇచ్చారు.

తొలుత ప్రైవేటుగా.. ఆనక బహిరంగంగా

1877లో కేవలం ఒకేఒక ఓటు తేడాతో వివాదాస్పదంగా అధ్యక్షుడైన రూథర్‌ఫోర్డ్..‌ శ్వేతసౌధంలో తొలుత ప్రైవేటుగా... ఆ తర్వాత రెండ్రోజులకు బహిరంగంగా ప్రమాణం చేశారు.

  • ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. ఎవరైతే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో వారు నియమించే ఓ కమిటీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు అయ్యే ఖర్చంతటినీ ఈ కమిటీయే సేకరించి... అమలు చేస్తుంది.
  • అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త అధ్యక్షుడితో ప్రమాణం చేయిస్తారు.
  • చాలామంది అధ్యక్షులు బైబిల్‌పై తమ ఎడమచేతిని ఉంచి ప్రమాణం చేస్తారు. ఇలా బైబిల్‌గానీ, లేదా మరేదైనా పవిత్రపుస్తకంపై ప్రమాణం చేయాలన్న నియమం ఏదీ లేదు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.