ETV Bharat / international

విమానాలను ధ్వంసం చేసే లేజర్ అమెరికా సొంతం! - అమెరికా నేవీ లేజర్ పరీక్షలు

అత్యంత శక్తిమంతమైన లేజర్ ఆయుధాన్ని అమెరికా నావికా దళం విజయవంతంగా పరీక్షించింది. దీని ద్వారా వైమానిక డ్రోన్లు, ఆయుధాలు కలిగిన చిన్నపాటి నౌకలను ధ్వంసం చేయవచ్చని తెలిపింది.

us navy laser weapon
అమెరికా నేవీ లేజర్ ఆయుధం
author img

By

Published : May 23, 2020, 7:18 PM IST

చిన్నపాటి విమానాలను ధ్వంసం చేయగలిగే శక్తిమంతమైన లేజర్​ ఆయుధాన్ని అమెరికా నావికా దళం విజయవంతంగా పరీక్షించింది. యూఎస్​ఎస్​ పోర్ట్​ల్యాండ్ రవాణా నౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అమెరికా నావికా దళ పసిఫిక్ ఫ్లీట్ విడుదల చేసింది.

అయితే ఈ లేజర్ ఆయుధ వ్యవస్థ పరీక్ష(ఎల్​డబ్ల్యూఎస్​డీ)లు జరిపిన నిర్దిష్ట ప్రదేశం గురించి వివరాలు చెప్పనప్పటికీ... మే 16న పసిఫిక్ మహా సముద్రంలో ప్రయోగించినట్లు నావికా దళం పేర్కొంది.

ఆయుధాల్లో లేజర్ వ్యవస్థ​ను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాల(డీఈడబ్ల్యూ)ను 1960 నుంచి అభివృద్ధి చేస్తోంది అమెరికా నౌకాదళం.

ఈ డీఈడబ్ల్యూ ఆయుధాలు రసాయన, విద్యుత్ శక్తిని రేడియేటెడ్ ఎనర్జీగా మార్చి లక్ష్యంపై దాడి చేస్తాయని.. తద్వారా శత్రువుల లక్ష్యాన్ని నాశనం చేస్తాయని యూఎస్ నేవీ వెల్లడించింది.

"యూఏవీ, చిన్న విమానాలను నాశనం చేసేలా ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా లేజర్ ఆయుధ వ్యవస్థ ఏ మేరకు పనితీరు కనబరుస్తుందో సమాచారాన్ని పొందవచ్చు. ఈ అధునాతన సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా సముద్రంలో యుద్ధాన్ని పూర్తిగా మార్చేయవచ్చు."

-కెప్టెన్ కారే శాండర్స్, పోర్ట్​ల్యాండ్ కమాండింగ్ అధికారి

ఈ లేజర్​ ద్వారా ఏరియల్ డ్రోన్ విమానాలను ధ్వంసం చేయవచ్చని అమెరికా నావికా దళం పేర్కొంది. ఆయుధాలు కలిగిన చిన్న పడవలు, డ్రోన్లపైనా లేజర్ ప్రభావవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: చైనాలో కరోనా కేసులు 0- ఆ దేశాల్లో మాత్రం టాప్​ గేర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.