ETV Bharat / international

కార్లలో తిరుగుతూ భీకర కాల్పులు- 15 మంది మృతి - కాల్పుల్లో 15 మంది మృతి

దుండగులు రెచ్చిపోయారు. అనేక కార్లలో నగరం మొత్తం తిరుగుతూ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొత్తం 15 మందిని బలిగొన్నారు. ఈ ఘటన మెక్సికో సరిహద్దు రాష్ట్రమైన రెనోసాలో జరిగింది.

Gunmen attacks in reynosa
కాల్పుల బీభత్సం- 15 మంది మృతి
author img

By

Published : Jun 20, 2021, 4:32 PM IST

అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో కొందరు దుండగులు మారణహోమం సృష్టించారు. మెక్సికో సరిహద్దు రాష్ట్రమైన రైనోసాలోని వివిధ ప్రాంతాల్లో కార్లలో తిరుగుతూ... విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందారు.

ఈ దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. అతడి కారులో డిక్కీలో ఉన్న ఇద్దరు మహిళలను రక్షించాయి. ఆ ఇద్దరిని ఆ దుండగుడు కిడ్నాప్​ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ప్రాంతంలో మాఫియా ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గల్ఫ్​ కార్టెల్ హవా నడుస్తుంది. ఇటీవల ఆ ముఠాలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో వరుస దాడులు చర్చనీయాంశమయ్యాయి.

ఇదీ చదవండి:కాల్పుల కలకలం- ఒకరు మృతి, 12 మందికి గాయాలు

విలయం సృష్టిస్తున్న వరదలు- 16 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.