ETV Bharat / international

'నిజమే.. అల్‌ఖైదా నెం.2 హతమయ్యాడు'

అల్​ ఖైదా ఉగ్ర సంస్థలో రెండో కీలక వ్యక్తి అబు మహమ్మద్​ అల్​-మస్రీని ఓ రహస్య ఆపరేషన్​ ద్వారా మట్టుబెట్టినట్లు అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్​ సైనికులతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అల్​-మస్రీని ఇరాన్​ రాజధాని టెహ్రాన్​లో ఆగస్టు 7న హతమార్చినట్లు వెల్లడించారు.

tehran alqaida
'నిజమే.. అల్‌ఖైదాలో రెండో కీలక వ్యక్తిని చంపేశాం'
author img

By

Published : Nov 15, 2020, 10:50 AM IST

అల్‌ఖైదాకు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది అబు మహమ్మద్‌ అల్‌-మస్రీని నిజంగానే హతమయ్యాడు. మోస్ట్​ వాటెండ్​ లిస్ట్​లో ఉన్న ఇతడిని.. అమెరికా-ఇజ్రాయెల్‌ సైనికులు ఓ రహస్య ఆపరేషన్​ ద్వారా మట్టుబెట్టినట్లు అగ్రరాజ్యం నిఘా అధికారులు తాజాగా ధ్రువీకరించారు. ఆగస్టు 7న ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధుల్లో అతడిని హతమార్చినట్లు స్పష్టం చేశారు. అయితే ఆపరేషన్​ పూర్తి వివరాలు వెల్లడించేందుకు మాత్రం వారు నిరాకరించారు.

అల్‌ఖైదా రెండో కీలక వ్యక్తి అయిన అల్​ మస్త్రీ నేతృత్వంలోనే.. 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి జరిగింది. 1998లో ఆఫ్రికాలో పలు అమెరికా దౌత్యకార్యాలయాలపై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి అల్‌-మస్రీనే అన్న ఆరోపణ ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇతడి కోసం తీవ్రంగా గాలిస్తోంది అమెరికా. అయితే ట్రంప్​ అధికారంలోకి వచ్చాక ఈ చర్యలను మరింత వేగవంతం చేశారు.

లాడెన్​ కోడలు కూడా..

అల్‌-మస్రీ కోసం చేపట్టిన ఆపరేషన్​లో అతడి కుమార్తె మరియంను కూడా సేనలు హతమార్చాయి. అల్‌-ఖైదా వ్యవస్థపకుడు ఒసామా బిన్‌-లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ భార్యే మరియం. హమ్జా బిన్‌ లాడెన్‌ను అమెరికా సేనలు గతంలోనే అంతమొందించాయి. ప్రస్తుత అల్‌ ఖైదా చీఫ్‌ అయమన్‌ అల్‌ జవహరీ తర్వాత ఆ పగ్గాలు అల్‌-మస్రీనే చేపడతారని అంతా భావించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో అల్‌ మస్రీ కూడా ఒకడు. ఇతనిపై 10 మిలియన్​ డాలర్ల రివార్డు కూడా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.