ETV Bharat / international

'ఆంథ్రిక్స్​'కు అమెరికా కోర్టు భారీ జరిమానా - Devas Multimedia NEWS

ఉపగ్రహ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కారణంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వాణిజ్య విభాగమైన ఆంథ్రిక్స్​ కార్పొరేషన్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. మొత్తం 1.2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొంది న్యాయస్థానం.

US court asks Antrix to pay USD 1.2 billion compensation to Bengaluru start-up
ఒప్పందం రద్దుతో 'ఆంథ్రిక్స్​'కు భారీ జరిమానా
author img

By

Published : Oct 30, 2020, 3:44 PM IST

బెంగళూరుకు చెందిన మల్టీమీడియా స్టార్టప్ దేవాస్​కు 1.2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వాణిజ్య విభాగమైన ఆంథ్రిక్స్​ కార్పొరేషన్​ను ఆదేశించింది అమెరికా జిల్లా కోర్టు. ఉపగ్రహ రూపకల్పన, నిర్వహణకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసినందుకే ఈ జరిమానా విధించింది.

2005 జనవరిలో రెండు ఉప గ్రహాల ప్రయోగం, నిర్వహణ విషయంలో ఆంథ్రిక్స్​- దేవాస్​ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే కొన్ని కారణాల వల్ల 2011లో దేవాస్​తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఆంథ్రిక్స్. దీనికి సంబంధించి దేవాస్​.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆంథ్రిక్స్​కు వివిధ దేశాల్లో బ్రాంచీలు ఉండటం వల్ల అంతర్జాతీయ ట్రిబ్యూనళ్లను ఆశ్రయించింది దేవాస్​. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్​పై అమెరికా వెస్టర్న్​ జిల్లా కోర్టు విచారించింది. ఈ నెల 27న తీర్పు ఇచ్చింది.

దేవాస్ మల్టీమీడియా కార్పొరేషన్‌కు ఆంథ్రిక్స్​ కార్పొరేషన్ 562.5 మిలియన్ డాలర్ల పరిహారంతో పాటు వడ్డీ కలిపి మొత్తం 1.2 బిలియన్​ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.