ETV Bharat / international

'భారత్- చైనా ఉద్రిక్తతలను గమనిస్తున్నాం'

భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. చైనా తన పొరుగు దేశాలను బెదిరించేందుకు చేస్తోన్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

US closely monitoring situation along India-China border says Official
'భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నాం'
author img

By

Published : Feb 10, 2021, 9:48 AM IST

భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అగ్రరాజ్యం నిశితంగా పరిశీలిస్తోందని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. భారత్- చైనా ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయనే విషయాన్ని గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి శాంతియుత చర్చలు జరిపేందుకు అమెరికా ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇటీవలే భారత్, చైనా సైనిక కమాండర్లు జరిపిన 9వ దఫా చర్చలను ఉద్దేశిస్తూ ప్రైస్​ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా దురాక్రమణలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే ఇండో-ఫసిఫిక్ మిత్రదేశాలకే మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. భారత్​, అమెరికా మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటామన్నారు.

క్వాడ్​ దేశాలే కీలకం..

స్వేచ్ఛాయుత ఇండో-ఫసిఫిక్ ప్రాంతాల అభివృద్ధికి క్వాడ్​ దేశాలతో అమెరికా మైత్రి చాలా కీలకమని నెడ్​ ప్రైస్​ అన్నారు. అందుకే జపాన్, ఆస్ట్రేలియా, భారత్​లతో అమెరికా సత్సబంధాలను పెంచుకునేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి:ట్రంప్ అభిశంసన: సెనేట్​లో ఆరుగురు రిపబ్లికన్ల మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.