అమెరికాలోని శాన్డియెగో తీర ప్రాంతం సమీపంలో ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది..
మెక్సికో నుంచి చట్ట విరుద్ధంగా ప్రజలను అమెరికాకు తరలించేందుకు స్మగ్లర్లు ఉపయోగించే చెక్కతో తయారైన ఓ పడవ.. శాన్డియెగోలోని పాయింట్ లోమా ద్వీపకల్ప సమీపంలో బోల్తాపడింది. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
శాన్డియెగో తీరంలోనే జరిగిన మరో ఘటనలో.. యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన మెక్సికన్లను అధికారులు అడ్డుకున్నారు. ఆ పడవలో ఇద్దరు వ్యక్తులు, అనుమానిత స్మగ్లర్లు పట్టుబడ్డారు.
ఇదీ చదవండి: విస్కాన్సిన్ క్యాసినోలో కాల్పుల కలకలం