ETV Bharat / international

యూనిసెఫ్​ చీఫ్​ హెన్రీట్టా ఫోర్ రాజీనామా!

యూనిసెఫ్​ చీఫ్​ హెన్రీట్టా ఫోర్​ రాజీనామా చేశారు. హెన్రీట్టా రాజీనామాను ఆంటోనియో గుటెరస్‌ ఆమోదించినట్లు ఐరాస ప్రతినిధి ఫర్హాన్​ హక్​ తెలిపారు.

unicef chief news latest
యూనిసెఫ్​ చీఫ్​ రాజీనామా!
author img

By

Published : Jul 14, 2021, 9:53 AM IST

యూనిసెఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ పదవికి హెన్రీట్టా ఫోర్​ రాజీనామా చేశారు. కుటుంబ ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. హెన్రీట్టా రాజీనామాను యూఎన్​ సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్‌ ఆమోదించినట్లు ఐరాస ప్రతినిధి ఫర్హన్ హక్​ వెల్లడించారు. యూనిసెఫ్​ చీఫ్​గా హెన్రీట్టా అందించిన సేవలను గుటెరస్​ అభినందించినట్లు తెలిపారు.

హెన్రీట్టా స్థానాన్ని భర్తీ చేసేవరకు ఆమెనే యూనిసెఫ్​ చీఫ్​గా కొనసాగుతారని హక్​ వెల్లడించారు.

2018 జనవరి 1న హెన్రీట్టా.. యూనిసెఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. యూనిసెఫ్​కు తొలి మహిళా అధ్యక్షురాలు కావడం గమనార్హం. అంతకుముందు హెన్రీట్టా.. వివిధ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్​ మింట్​కు డైరక్టర్​గా​, యూఎస్​ఏఐడీ అడ్మినిస్ట్రేటర్​గా హెన్రీట్టా పనిచేశారు.

ఇదీ చదవండి : ఐరాసను గుప్పిట పట్టేందుకు చైనా పన్నాగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.