ETV Bharat / international

మయన్మార్​లో అలజడి- ఐరాస ఉన్నత స్థాయి భేటీ - ఐక్యరాజ్య సమితి మానవ హక్కల మండలి సమావేశం

మయన్మార్​లో నిరసనలు ఉద్ధృతమవుతున్న తరుణంలో ఐరాస మానవ హక్కుల మండలి ఉన్నత స్థాయి సమావేశం సోమవారం ప్రారంభమైంది. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీలో పాల్గొంటున్నారు. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంశాలపై చర్చే ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగనుంది.

UN human rights body opens session
మయన్మార్​ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరాస ఉన్నతస్థాయి సమావేశం
author img

By

Published : Feb 22, 2021, 6:02 PM IST

సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్​లో ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్​హెచ్​ఆర్​సీ) ఉన్నత స్థాయి సమావేశం సోమవారం ప్రారంభమైంది. మయన్మార్​లో సైన్యం తిరుగుబాటు, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ అరెస్టు, శ్రీలంక, ఇథియోపియోలో హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

యూఎన్​హెచ్​ఆర్​సీ సమావేశానికి అనేక దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరయ్యారు. వెనిజులాలో అసమ్మతిపై హింసాత్మక అణచివేతకు నేతృత్వం వహించిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్​ మదురో ఈ సమావేశంలో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఉయ్​గర్లపై చైనా అనుసరిస్తున్న వైఖరిని కూడా ఇందులో చర్చించనున్నారు. నాలుగు వారాల పాటు ఈ భేటీ జరగనుంది.

రెండున్నరేళ్ల అనంతరం.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో అమెరికా మళ్లీ చేరింది. ఆన్​లైన్​ వేదికగా జరుగుతున్న ఈ సమావేశంలో ప్రపంచ నలుమూలలా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ ఆందోళన వ్యక్తం చేశారు. జాత్యహంకారం, వివక్షతలను, అసమానత్వాన్ని ఖండించారు. ఈ భేటీలో అమెరికా, బ్రిటన్​, జర్మనీ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పాక్​పై భిన్నాభిప్రాయాలు- 'గ్రే' లిస్ట్​లోనే కొనసాగింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.