ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ మేరకు యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్ బోజ్కిర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
"ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను సాధించడంలో నేను చేసిన సేవను గౌరవంగా భావిస్తున్నాను. సభ్యదేశాలు కోరుకుంటే తప్పక రెండో సారి పదవి బాధ్యతలను స్వీకరిస్తాను."
ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
రెండోసారి పదవిలో కొనసాగడానికి అభిప్రాయం తెలపాలని ఆంటోనియో గుటెరస్‌కు అధ్యక్షుడు బోజ్కిర్ గత శుక్రవారం లేఖ రాశారు. దానికి స్పందిస్తూ.. గుటెరస్ సోమవారం లేఖ రాశారని యూఎన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు గుటెరస్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలిపారని వివరించారు.
పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరస్, 2017 జనవరి 1న ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి:గురువారం చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందం