ETV Bharat / international

చైనాపై ఆంక్షల దిశగా వేగంగా అడుగులు! - చైనాపై ఆంక్షల బిల్లు

చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా వేగంగా అడుగులు వేస్తోంది. 'ద కొవిడ్- 19 అకౌంటబిలిటీ' బిల్లును ఒక్కరోజు వ్యవధిలోనే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇందులోని అంశాలపై ఇంకా దృష్టి పెట్టలేదని.. త్వరలోనే పరిశీలిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

VIRUS-US-CHINA-SANCTIONS
చైనాపై ఆంక్షల దిశగా వేగంగా అడుగులు!
author img

By

Published : May 14, 2020, 11:08 AM IST

ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన 'చైనాపై ఆంక్షల బిల్లు'పై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ బిల్లుపై ఇంకా దృష్టి పెట్టలేదని.. త్వరలోనే పరిశీలిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తి విషయంలో అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా సహకరించకపోతే దానిపై ఆంక్షలు విధించే అధికారం అధ్యక్షుడికి కల్పించాలని ఈ బిల్లు చెబుతోంది. 'ద కొవిడ్- 19 అకౌంటబిలిటీ యాక్ట్' బిల్లును లిండ్సే గ్రహమ్ నేతృత్వంలోని 9 మంది సెనేటర్ల బృందం ప్రతినిధుల సభలో మంగళవారం సమర్పించింది.

ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యుడు డౌగ్​ కొలిన్స్​ ప్రతినిధుల సభలో ​ బుధవారం ప్రవేశపెట్టారు. దీనికి 24 మందికిపైగా చట్టసభ్యులు మద్దతు తెలిపారు.

"అమెరికాకు దశాబ్దాలుగా చైనా కమ్యూనిస్టు పాలన హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం ఈ ప్రక్రియలో తారస్థాయికి చేరింది. దీనిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్షల మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు చైనా తప్పనిసరిగా బాధ్యత వహించాలి. "

- డౌగ్​ కొలిన్స్​, చట్ట సభ్యుడు

ఈ మేరకు మహమ్మారి వ్యాప్తిలో చైనా చర్యలకు సంబంధించి నిఘా సమాచారాన్ని అందివ్వాలని హోంల్యాండ్ సెక్యురిటీ శాఖ(డీహెచ్​ఎస్​)ను కాంగ్రెస్ సభ్యులు కోరారు. చైనా ప్రభుత్వాన్ని నమ్మలేమని.. నిజానిజాలేంటో తెలుసుకునేందుకు అమెరికా నిఘా విభాగంపైనే తమకు పూర్తి విశ్వాసముందని కాంగ్రెస్ సభ్యుడు, డీహెచ్​ఎస్​ నిఘా, ఉగ్రవాద వ్యతిరేక విభాగం చీఫ్ మ్యాక్స్ రోజ్​ అన్నారు.

ఈ బిల్లు అమల్లోకి వస్తే..

అమెరికా దాని మిత్ర దేశాలు లేదా ఐరాస అనుబంధ సంస్థలతో కరోనా వ్యాప్తికి సంబంధించి ఏదైనా విచారణకు చైనా అంగీకరించాలి. ఈ విచారణలో తేలిన విషయాలకు చైనా జవాబుదారీగా ఉండాలి. వైరస్​ వ్యాప్తికి కారణమవుతోన్న చైనాలోని అన్ని వెట్​ మార్కెట్లు (వన్యప్రాణి మాంస విక్రయశాలలు) మూసివేయాలి. అమెరికా అధ్యక్షుడి ధ్రువీకరణ తర్వాత విచారణకు సంబంధించి పూర్తి వివరాలు అమెరికా కాంగ్రెస్​కు సమర్పించాలి. ఈ తతంగమంతా 60 రోజులలోపు జరగాలి.

ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారం లభిస్తుంది. ఆస్తులను స్తంభింపజేయటం, ప్రయాణాలపై నిషేధం, వీసా రద్దు, చైనా వ్యాపారాలకు అమెరికా బ్యాంకుల రుణాల నిరాకరణ, అమెరికా స్టాక్​ ఎక్స్ఛేంజీల నుంచి చైనా కంపెనీల తొలగింపు వంటి చర్యలు తీసుకోవచ్చు.

ఇదీ చూడండి: అమెరికా చట్టసభలో చైనాపై ఆంక్షల బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.