అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా '@POTUS'ను జనవరి 20న కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌కు అప్పగించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ అంగీకరించకపోయినా.. బైడెన్‌కు పోటస్‌ను బదిలీ చేస్తామని స్పష్టం చేసింది.
ఈ విషయానికి సంబంధించి ట్రంప్‌తో పాటు బైడెన్ బృందానికి ఎలాంటి సమాచారం ఇవ్వనక్కరలేదని ట్విట్టర్ తెలిపింది. ప్రస్తుతం ఆ ఖాతాలో ఉన్న ట్వీట్లన్నీ భద్రపరచి.. ఖాళీ అకౌంట్‌ను బైడెన్‌కు అప్పగిస్తామని వెల్లడించింది.
ఇదే విధంగా శ్వేతసౌధం (@whitehouse), ఉపాధ్యక్షురాలు (@VP), తొలి మహిళా (@FLOTUS) ఖాతాలను బదిలీ చేస్తామని ట్విట్టర్ తెలిపింది. గత ఎన్నికల్లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించామని పేర్కొంది.
ఇదీ చూడండి: 'చట్టానికి లోబడే అధికార మార్పిడి'