అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్(14)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ట్రంప్ సతీమణి మెలానియా.. శ్వేతసౌధం వెబ్సైట్లో వెల్లడించారు. అయితే బారన్‌కు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్, మెలానియాకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే చికిత్స తర్వాత ట్రంప్, మెలానియాలు కోలుకున్నారు. అనంతరం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ తిరిగి పాల్గొంటున్నారు ట్రంప్.
" మరోమారు పరీక్షలు చేశాక పాజిటివ్‌గా తేలింది. అదృష్టం కొద్ది ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కరోనా వల్ల ముగ్గురం కలిసి ఒకే దగ్గర గడపటం, ఒకరిగురించి మరొకరు పట్టించుకోవటం, యోగక్షేమాలు తెలుసుకునే వీలు కలగటం వల్ల ఒక విధంగా నేను సంతోషంగా ఉన్నా."
- మెలానియా ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ
తనకు కరోనా సోకినప్పటికీ.. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటం వల్ల తాను అదృష్టవంతురాలినని పేర్కొన్నారు మెలానియా. సహజమైన మార్గంలో మెడిసిన్ తీసుకోవటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా ఎంచుకున్నట్లు తన అనుభవాన్ని పంచుకున్నారు. తమ చుట్టూ అద్భుతమైన సంరక్షకులు ఉన్నారని, డాక్టర్ కాన్లే, ఆయన బృందం విశేష కృషి చేసిందన్నారు. వారికి ఎప్పటికీ కృతజ్ఞులమని తెలిపారు.
ఇదీ చూడండి: ట్రంప్ కోలుకున్నారు సరే.. మెలానియా ఎక్కడ?