ETV Bharat / international

వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు

మానవులపై కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ను నెమ్మదింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎఫ్​డీఏపై మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. పరీక్షలు నిర్వహించేందుకు ఔషధ సంస్థలకు సహకరించడం లేదని ఆరోపించారు.

Trump slams FDA for slowing down human trials of COVID-19 vaccine
వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యం చేస్తున్నారని ట్రంప్ మండిపాటు
author img

By

Published : Aug 23, 2020, 9:50 AM IST

కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ) ఆలస్యం చేస్తోందని ఆరోపించారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. మానవులపై ప్రయోగాలను నెమ్మదింపజేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తూ శనివారం ట్వీట్​ చేశారు.

"మానవులపై కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ను నిర్వహించాలనుకుంటున్న ఔషధ సంస్థలకు ఎఫ్​డీఏ సహకరించడం లేదు. ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తున్నారు. నవంబరు 3 వరకు సమాధానం చెప్పాలని వారు భావించడం లేదు. వ్యాక్సిన్ ట్రయల్స్ వేగవంతం చేసి, ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలి"

-డొనాల్డ్​ ట్రంప్​ ట్వీట్.

అమెరికాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్ క్యాండిడేట్లు.. చివరి దశ ట్రయల్స్​లో ఉన్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు 58లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. లక్షా 80వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: చైనా ఆగడాలపై భారత్​కు వియత్నాం ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.