ETV Bharat / international

ట్రంప్​ మరో షాక్​.. హెచ్- 1బీ వీసాలపై కీలక నిర్ణయం - trump latest news

వలస ఉద్యోగార్థులను అమెరికా కంపెనీలు నియమించకుండా నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. హెచ్​-1బీ వీసాదారులు ఈ జాబితాలో ఉంటారు. ఈ నిర్ణయం భారత ఐటీ నిపుణులకు పెద్ద దెబ్బ కానుంది.

Trump
ట్రంప్
author img

By

Published : Aug 4, 2020, 12:01 PM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన నిరుద్యోగానికి అడ్డుకట్ట వేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఆయన దృష్టి హెచ్‌-1బీ వంటి వలసదారుల వీసాల మీదే ఉంది. ఈ క్రమంలో ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులను, మరీ ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాలో ఉన్న వారిని నియమించకుండా నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సోమవారం ట్రంప్‌ సంతకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

"ఫెడరల్‌ ప్రభుత్వం అమెరికన్లను మాత్రమే నియమించుకొనేలా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నాను" అని సంతకం పెట్టడానికి ముందు వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. చౌకగా పనిచేసే విదేశీ కార్మికుల కోసం కష్టపడి పనిచేసే అమెరికన్లను తొలగించే నిర్ణయాలను తన పాలనలో సహించనని తేల్చిచెప్పారు.

భారతీయులకు ఎదురుదెబ్బ

అమెరికన్‌ ఉద్యోగాలను సృష్టించడానికి అధిక పారితోషికం తీసుకొనే నిపుణుల కోసం మాత్రమే హెచ్‌-1బీ వీసాలను వినియోగించాలని స్పష్టం చేశారు. అమెరికా ఉద్యోగ మార్కెట్​పై కన్నేసిన భారతీయ ఐటీ నిపుణులకు ఇది పెద్ద దెబ్బ కానుంది.

ఎన్నికల ముందు..

కాగా, అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే తమ దేశంలో స్థానం కల్పించేందుకు వీలుగా సంవత్సరాంతం(2020) వరకు హెచ్‌-1బీ వీసాలతో పాటు ఇతర విదేశీ వీసాలను రద్దు చేస్తూ జూన్‌ నెలలో ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ట్రంప్‌ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​పై పాక్​ కుట్రలు ఫలించటం కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.